సారాతో వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-18T04:56:50+05:30 IST

ఏలేశ్వరం, అక్టోబరు 17: ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృత్వంలో ఆదివారం సిబ్బంది ఏలేశ్వరం శివారు అప్పన్నపాలెంలో సారా తయారీ స్థావరాల

సారాతో వ్యక్తి అరెస్ట్‌

ఏలేశ్వరం, అక్టోబరు 17: ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృత్వంలో ఆదివారం సిబ్బంది ఏలేశ్వరం శివారు అప్పన్నపాలెంలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 

మల్లిశాలలో..

జగ్గంపేట, అక్టోబరు 17: మల్లిశాల గ్రామశివారున సారా తయారు చేస్తున్నారని సమాచారం మేరకు ఆదివారం జగ్గంపేట ఎస్‌లక్ష్మి సిబ్బందితో దాడి చేశారు. 250 లీటర్ల బెల్లపు ఊట, తయారీ సామాగ్రిని ధ్వ ంసం చేశారు. సారాతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-10-18T04:56:50+05:30 IST