సారా, నల్లబెల్లంతో పట్టుబడిన సర్పంచ్‌

ABN , First Publish Date - 2021-02-28T05:13:58+05:30 IST

నాటుసారా, నల్లబెల్లాన్ని తరలిస్తున్న సర్పంచ్‌తో పాటు మరో వ్యక్తిని సూర్యాపేట ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు.

సారా, నల్లబెల్లంతో పట్టుబడిన సర్పంచ్‌

మూత్రవిసర్జన పేరుతో ఎక్సైజ్‌ కార్యాలయం నుంచి పరారీ

సూర్యాపేట క్రైం, ఫిబ్రవరి 28 : నాటుసారా, నల్లబెల్లాన్ని తరలిస్తున్న సర్పంచ్‌తో పాటు మరో వ్యక్తిని సూర్యాపేట ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో మోతె మండలం గోపతండా సర్పంచ్‌ కొర్ర తిరుపతి, అదేతండాకు చెందిన గుగులోతు సురేష్‌ 30 లీటర్ల నాటుసారా, 500 కేజీల నల్లబెల్లం, 25 కేజీల పట్టిక తరలిస్తుండగా గుర్తించి, వాహనంతో పాటు నిందితులను ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించామన్నారు. సారా, బెల్లం, పట్టిక, వాహనాన్ని సీజ్‌ చేయగా, అదే సమయంలో మూత్రవిసర్జనకు వెళ్తానని నమ్మించి వెళ్లిన సర్పంచ్‌ తిరుపతి తప్పించుకుని పారిపోయాడని తెలి పారు. ఈ విషయమై పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. మరో నిందితుడైన గుగులోతు సురే్‌షను రిమాండ్‌కు తరించినట్లు తెలిపారు. తప్పించుకొని వెళ్ళిన సర్పంచ్‌ తిరుపతిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్లు రాగవీణ, శ్రీనివాస్‌, కుమారస్వామి, పవన్‌కుమార్‌, రాఘవేంద్ర, శేఖర్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T05:13:58+05:30 IST