సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ భావితరాలకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-19T05:53:35+05:30 IST

మొఘల్‌ పాలకులను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాకుండా సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవడం

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ భావితరాలకు స్ఫూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 18 : మొఘల్‌ పాలకులను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాకుండా సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటను ఏలిన ధీరుడిగా సర్దార్‌ సర్వాయిపాపన్నగౌడ్‌ చరిత్రకెక్కారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆఽఽధ్వర్యంలో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన పాపన్నగౌడ్‌ 372వ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పాపన్నగౌడ్‌, కొమరంభీం, చాకలి ఐలమ్మ వంటి పోరాటయోధులను నాటి పాలకులు విస్మరించారని, తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని గౌరవించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అదే క్రమంలో సర్వాయిపాపన్నగౌడ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదని, భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘనకీర్తిని సొంతం చేసుకున్నాయన్నారు. సర్వాయిపాపన్నగౌడ్‌ వంటి యోధులు ఏ వర్గానికి, పరిమితం కాదని, మొఘలుల  దోపిడీ నుంచి స్వేచ్ఛ లభించాలని పోరాటం చేసిన పాపన్నగౌడ్‌ అందరివాడన్నారు. రాచరికపు వ్యవస్థలో శిస్తు కట్టించుకొని అణిచివేయడమే తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియని చీకటిరోజుల్లో అట్టడుగు వర్గాల బానిసబతుకుల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన యోధుడు పాపన్న అని కొనియాడారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్‌ ఆదర్శాలు, ఆశయాలను గుర్తించి, ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఆయన విగ్రహానికి స్థలాన్ని గుర్తించామని, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాలను కలుపుకొని ఆనాటి పాలకుల పెత్తనంపై పోరాటాలకు పాపన్నగౌడ్‌ నాంది పలికారన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత, కమిటీ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, గౌడ సంఘాల నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌, తండు సైదులుగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, శంకర్‌గౌడ్‌, బిక్షంగౌడ్‌, విశ్రాంతిఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

క్రీడాస్ఫూర్తితో ఆడినప్పుడే గెలుపుబాట : మంత్రి 

నల్లగొండ స్పోర్ట్స్‌: క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడినప్పుడే విజయం సొంతమవుతుందని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వివిధ క్రీడల్లో మూడు రోజుల నుంచి పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. వజ్రోత్సవాలను 15రోజల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొర్రసుధాకర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కేవి. రమాణచారి, రావుల శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:53:35+05:30 IST