అమ్మవారికి పుట్టింటి చీర

ABN , First Publish Date - 2022-07-01T06:46:03+05:30 IST

నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా ప్రతిరోజు భక్తులు అమ్మవారికి చీరె సారే సమర్పించుకుంటారు.

అమ్మవారికి  పుట్టింటి చీర
అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకొస్తున్న మహిళలు

నంద్యాల (కల్చరల్‌), జూన్‌ 30: నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా ప్రతిరోజు భక్తులు అమ్మవారికి చీరె సారే సమర్పించుకుంటారు. గురువారం ఆషాడమాసం సందర్భంగా నంద్యాలలో జగజ్జనని అమ్మవారికి ఆళ్లగడ్డ గ్రామం నుంచి మహిళలు  అమ్మవారికి పుట్టింటి చీరె, సారె తీసుకొని వచ్చి సమర్పించారు. అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టు చీరె-సారె తీసుకొని నంద్యాల సంజీవనగర్‌ రామాలయం నుంచి ఆత్మకూరు బస్టాండు మీదుగా భక్తులు సింగారిమేళంతో ఊరేగింపుగా భక్తిపాటలు పాడుచూ జగజ్జనని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టుచీరె -సారె సమర్పించారు. దుర్గా ఫ్రెండ్స్‌ యూనిట్‌ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. 



Updated Date - 2022-07-01T06:46:03+05:30 IST