‘సంతోషంగా పండుగ జరుపుకొనేందుకే చీరల పంపిణీ’

ABN , First Publish Date - 2022-09-26T03:47:40+05:30 IST

ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. రెబ్బనపల్లి, ముత్యంపేట, కోర్విచెల్మ చెల్కగూడెం, చింతపల్లి, నెల్కివెంకటాపూర్‌, దండేపల్లి, నర్సాపూర్‌, మ్యాదరిపేట, మామిడిపల్లి, లింగాపూర్‌, మాకులపేట, నాగసముద్రం, తాల్లపేట, రాజుగూడ, అల్లీపూర్‌, గుడిరేవు గ్రామాల్లోని ఆదివారం బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

‘సంతోషంగా పండుగ జరుపుకొనేందుకే చీరల పంపిణీ’
కొర్విచెల్మలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

దండేపల్లి, సెప్టెంబరు 25: ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. రెబ్బనపల్లి, ముత్యంపేట, కోర్విచెల్మ చెల్కగూడెం, చింతపల్లి, నెల్కివెంకటాపూర్‌, దండేపల్లి, నర్సాపూర్‌, మ్యాదరిపేట, మామిడిపల్లి, లింగాపూర్‌, మాకులపేట, నాగసముద్రం, తాల్లపేట, రాజుగూడ, అల్లీపూర్‌, గుడిరేవు గ్రామాల్లోని ఆదివారం బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దేశంలో ఏ ప్రభు త్వాలు చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రైతులు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నార న్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, పీఏసీఎస్‌ చైౖర్మన్‌ లింగన్న, పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రేణి శ్రీనివాస్‌, సర్పంచులు కళ్యాణి, భీంరావు, తిరుపతి, దేవేంద్ర, చంద్రకళ రాజేశ్వరీ, శంకరవ్వ, లక్ష్మణ్‌, శ్యామల, ప్రేమల, రాజవ్వ, కళావతి, లచ్చుపటేల్‌, ఉప సర్పంచులు పాల్గొన్నారు.     

ఏసీసీ: పాత మంచిర్యాల 8, 9 వార్డులకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆదివారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్‌ చీరల పంపిణీ చేపట్టార న్నారు.  మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, 9వ వార్డు కౌన్సిలర్‌  సునీత కిషన్‌, కౌన్సిలర్లు గాదె సత్యం, గౌస్‌, మాజీ కౌన్సిలర్లు రాజన్న, కమల, తిరుపతి,  పాల్గొన్నారు.  

బెల్లంపల్లి రూరల్‌: బట్వానపల్లి, ఆకెనపల్లి గ్రామాల ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న  బతుకమ్మ చీరలను ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ ఆదివా రం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలకు చీరల ను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కు తుందన్నారు. ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్‌రావు, సర్పంచ్‌ లు ఉమాదేవి,  నిర్మల, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.  

కాసిపేట: మల్కేపల్లిలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ మహి ళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ మహిళలందరు బతుకమ్మ పండగను సం తోషంగా జరుపుకోవాలని బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. సర్పంచు కుడిమేత లక్ష్మీ, ఉపసర్పంచు జనార్ధన్‌, నాయకులు శంకర్‌గౌడ్‌,రమణారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-26T03:47:40+05:30 IST