దళితులను మోసగిస్తున్న సర్కార్‌

ABN , First Publish Date - 2022-08-13T05:16:44+05:30 IST

దళితుబంధు పేరిట దళితులను సర్కార్‌ మోసగిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అటకెక్కిందని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మండిపడ్డారు.

దళితులను మోసగిస్తున్న సర్కార్‌
పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర

ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 12: దళితుబంధు పేరిట దళితులను సర్కార్‌ మోసగిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అటకెక్కిందని  ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మండిపడ్డారు. ఇటిక్యాల మండలంలోని శుక్రవారం నాలుగవ రోజు  ఆజాదీకా గౌరవ్‌ యాత్ర వేముల నుంచి ప్రారంభమై చాగపురం, షాబాద్‌, శనిగపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా మహిళలు సంపత్‌కుమార్‌కు రాఖీ కట్టి ఘనస్వాగతం పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజల సంక్షేమం కుంటుపడిందని, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి  పాటుపడిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పాటునిచ్చాందని, మళ్లీ కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.  అనంతరం అయిజ మండలం యాపదిన్నెకు చేరుకుంది. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, బాలకృష్ణారెడ్డి, నరసింహ, ఎర్రవల్లి సర్పంచ్‌ రవి, గోవర్ధన్‌రెడ్డి, మహేష్‌ యాదవ్‌,శ్యాం సుందర్‌, అల్లబకష్‌ పాల్గొన్నారు.

  కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

ధరూరు/మల్దకల్‌ : దేశానికి స్వాతంత్య్ర తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, దేశంలో అభివృద్ధి చేసింది కూడా కాంగ్రెస్సే అని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  అధికారంలోని రావడం ఖాయమని డీసీసీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.  ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ధరూరు మండల కేంద్రం నుంచి భూరెడ్డిపల్లె, మార్లవీడు, మల్దకల్‌ మండలంలోని బిజ్వారం వరకు పాదయాత్ర కొనసాగింది. అడుగడుగునా పాదయాత్రలో స్థానిక రైతులతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాటామంతీ కలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు.   కార్యక్రమంలో  మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ శంకర్‌, కాంగ్రెస్‌నాయకులు  నారాయణ రెడ్డి, వీరుబాబు, నల్లారెడ్డి, గౌస్‌, నందు, షేక్‌జమాల్‌, అలెగ్జాండర్‌ రఘునాయుడు, బీసన్న, మాచర్ల వీరేష్‌, రాముడు, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:16:44+05:30 IST