Advertisement

`సర్కారు వారి పాట` మరింత ఆలస్యం?

Oct 22 2020 @ 15:44PM

ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. దాని తర్వాత డైరెక్టర్ పరశురామ్‌తో `సర్కారు వారి పాట` సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు. కథ ప్రకారం ఈ సినిమా‌ను అధిక భాగం అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంటుంది.


పరశురామ్, అతని టీమ్ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసి, వెనక్కి తిరిగి వచ్చారు. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇప్పుడు వీసాల సమస్య తలెత్తినట్టు సమాచారం. యూఎస్ వెళ్లే టీమ్ ఇప్పటికే వీసాల కోసం దరఖాస్తులు చేసుకోగా.. అవి ఇంకా ప్రాసెస్ కాలేదని తెలుస్తోంది. వీసాలు రావడం ఆలస్యమైతే సినిమా షూటింగ్ ప్రారంభం కావడం మరింత ఆలస్యమవుతుంది. వీసాలు వచ్చేస్తే ఆమెరికాలోనే 45రోజుల పాటు వరుసగా షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.