Advertisement

'సర్కారువారి పాట' షురూ

Jan 25 2021 @ 10:33AM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.  షూటింగ్స్‌ బిగిన్స్‌ అనే చిన్న పాటి వీడియో ప్రోమోతో పాటు 'ఆక్షన్‌ యాక్షన్‌ బిగిన్స్‌' అంటూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది చిత్ర యూనిట్‌. మహేశ్‌ 27వ సినిమా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. ఎట్టకేలకు చిత్ర యూనిట్‌ 'సర్కారువారి పాట' చిత్రీకరణను దుబాయ్‌లో చిత్రీకరించారు.  


 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.