ltrScrptTheme3

'సర్కారు వారి పాట: ‘దూకుడు’ చిత్రాన్ని గుర్తుచేస్తున్నారా..?

Oct 26 2021 @ 08:21AM

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రబృదం స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడ సాంగ్స్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మూవీలోని సాంగ్ మేకింగ్‌కి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పిక్ చూస్తుంటే ‘దూకుడు’ చిత్రం గుర్తుచేస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆ మూవీలో ‘గురువారం మార్చ్ 1’ అనే సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్‌లో సమంత, మహేశ్‌లతో పాటు ఫారిన్ అమ్మాయిలు కనిపిస్తారు. టర్కీలో షూట్ చేసిన ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజిషన్..సాంగ్ మేకింగ్ అంతా సూపర్ అని చెప్పుకున్నారు. 

ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమా సాంగ్ స్పెయిన్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో కీర్తి సురేశ్, మహేశ్ బాబులతో పాటు ఫారిన్ అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా థమన్ కావడం విశేషం. దాదాపు 7 ఏళ్ళ తర్వాత మహేశ్ - థమన్ కాంబో రిపీటవుతుండంతో ఆల్బం మీద భారీ అంచనాలున్నాయి. ఇక 'దూకుడు'లోని సాంగ్‌ను ఇప్పుడు 'సర్కారు వారి పాట'లోని సాంగ్‌ను అభిమానులు కంపేర్ చేస్తూ..ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి పరశురామ్ పెట్లా దర్శకుడు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు. 2022, సంక్రాంతికి విడుదల కానుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.