'సర్కారువారి పాట'కి కరోనా బ్రేక్‌

Apr 18 2021 @ 12:17PM

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ మామూలుగా లేదు. అన్ని రంగాల తరహాలో సినీ రంగంపై కొవిడ్ సెకండ్‌ వేవ్‌ గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సినీ వర్గాలు, సంబంధిత చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ సినీ పరిశ్రమలో కార్మికులు, ఇతర యూనిట్ వర్గాలు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ 'సర్కారువారిపాట' సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి దుబాయ్‌, గోవా షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసిన యూనిట్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా హైదరాబాద్‌లోనే షూటింగ్‌ను రీసెంట్‌గా స్టార్ట్‌ చేసింది. స్టార్ట్‌ చేసి వారం తిరక్క ముందే యూనిట్‌లో ఐదారుగురుకి కరోనా సోకింది. దీంతో షూటింగ్‌ మొత్తం ఆపేసి అందరూ సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి వెళ్లిపోయినట్లు సమాచారం. మరెప్పుడు ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అవుతుందో చూడాలి మరి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.