`స‌ర్కారువారి పాట‌` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌ ఎప్పుడంటే?

Apr 23 2021 @ 13:58PM

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `స‌ర్కారువారిపాట‌`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినీ వ‌ర్గాల లేటెస్ట్ స‌మాచారం మేర‌కు, ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను మే 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ట‌. అలాగే టీజ‌ర్‌ను, మ‌హేశ్ పుట్టిన‌రోజు ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.