సర్పంచ్‌.. టీచరు

ABN , First Publish Date - 2022-06-22T05:06:15+05:30 IST

ప్రస్తుతం పాగోడు సర్పంచ్‌గా పనిచేస్తున్న దామ మన్మఽథరావు డీఎస్సీ- 1998 క్లాలిఫైడ్‌ లిస్టులో టీచర్‌ గా ఎంపికయ్యారు. 57 సంవత్సరాల వయసులో టీచర్‌ ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

సర్పంచ్‌.. టీచరు
దామ మన్మథరావు

57వ ఏట ఉద్యోగం పొందిన మన్మథరావు

జలుమూరు: ప్రస్తుతం పాగోడు సర్పంచ్‌గా పనిచేస్తున్న దామ మన్మఽథరావు  డీఎస్సీ- 1998 క్లాలిఫైడ్‌ లిస్టులో టీచర్‌ గా ఎంపికయ్యారు. 57 సంవత్సరాల వయసులో టీచర్‌ ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మన్మథరావు కొన్నాళ్లు నరసన్న పేట కోర్టులో న్యాయ వాదిగా పనిచేశారు. ప్రజాసేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2021లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాలో అతడి పేరు ఉండడంతో సర్పంచ్‌గా కొనసాగ డమా? లేక ఉపాధ్యాయ వృత్తిలో చేరడమా అన్న మీమాంసలో ఉన్నారు. ఉపాధ్యాయుడిగా చేరితే ఐదేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయమై మన్మఽథరావు ను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించగా దీనిపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Updated Date - 2022-06-22T05:06:15+05:30 IST