ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

ABN , First Publish Date - 2022-08-19T05:21:09+05:30 IST

దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడు నిరూపించారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి
జిల్లా కేంద్రంలో సర్దార్‌ పాపన్న గౌడ్‌కు నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం

- దళిత బహుజనులు ఏకమై పోరాడాలి : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా వ్యాప్తంగా వేడుకలు 

- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

గద్వాల క్రైం : దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడు నిరూపించారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్దార్‌ సర్వా యి పాపన్న గౌడు జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, మునిసిపల్‌ చైర్మన్‌ కేశవ్‌, బీసీ సంక్షేమశాఖ అధికారి శ్వేతప్రియదర్శిని, గౌడ సంఘం నాయకులు పచ్చర్ల శ్రీధర్‌గౌడు పాల్గొన్నారు. 


సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడును ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ అన్నారు. సర్వాయి పాపన్నగౌడు జయంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. 


గద్వాల : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పాపన్న గౌడ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయా నాయక్‌, సిబ్బంది రాజు, నాగరాజు, భాస్కర్‌ పాల్గొ న్నారు. అదే విధంగా మండల పరిషత్‌, తహసీ ల్దార్‌ కార్యాలయాలలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.


సర్దార్‌ నేటితరానికి ఆదర్శం : ఎమ్మెల్యే బండ్ల

గద్వాల టౌన్‌ : మొఘల్‌ పాలకుల అరాచకాలను ఎదురించి, తానే సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకు న్న సర్దార్‌ సర్వాయి పాపన్న సాహసం నేటితరానికి ఆదర్శమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కొని యాడారు. పాపన్న గౌడ్‌ జయంతిని గురువారం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని గౌడ కమ్యూ నిటీ హాల్‌ స్థలంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం హాజరయ్యారు. దివం గత నాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీఽధర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ గౌడ్‌, కోశాధికారి గోవర్ధన్‌ గౌడ్‌,  అచ్చన్నగౌడ్‌, వెంకటస్వామి గౌడ్‌ పాల్గొన్నారు. 


అలంపూర్‌ చౌరస్తా : అలంపూర్‌ చౌరస్తాలో గురువారం నిర్వహించిన సర్దార్‌ సర్వాయిపాపన్న జయంతి వేడుకల్లో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అయన చేసిన సేవలను కొనియాడారు. గౌడ సమాజానికి అయన మార్గనిర్దేశకుడన్నారు. అలాగే బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి కేశవులు సర్దార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 


ధరూరు : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌, ఆర్‌ఐ లతీఫ్‌, సిబ్బంది లక్ష్మణ్‌, రమేష్‌ పాల్గొన్నారు.  


మల్దకల్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని పురస్కరించుకొని మల్దకల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరికృష్ణ, ఆర్‌ఐ రామకృష్ణ, సుబ్రమణ్యంగౌడ్‌, నడిగడ్డ గౌడ సంఘం మల్దకల్‌ మండల అధ్యక్షుడు వీరేష్‌గౌడ్‌, గౌడ  సంఘం అధ్యక్షుడు వీరన్నగౌడ్‌, పాల్గొన్నారు.


కేటీదొడ్డి : మండల కేంద్రంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడులను ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉరుకుందు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు, యుగంధర్‌, మల్లేష్‌, మురళి, ఈష, శివుడు పాల్గొన్నారు.  


ఇటిక్యాల : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎంపీపీ స్నేహ, ఎంపీడీవో రాఘవ పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యద ర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. 


గట్టు : సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడు జయంతి వేడుకలను మండల కేంద్రంలో గురువారం నడిగడ్డ గౌడ్స్‌ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్‌ అవరణలో సర్వాయి పాపన్నగౌడు చిత్ర పటా నికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. పట్టణంలో సర్వాయి పాపన్న గౌడు విగ్రహం ఏర్పాటు చేసుకుందామని నాయకులు తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్‌గౌడు, ప్రధాన కార్యదర్శి సురేష్‌గౌడు, అధికార ప్రతినిధి నర్సింహులు గౌడ్‌, మండల అధ్యక్షుడు రంగస్వామిగౌడు, సుధీర్‌గౌడు, రవికుమార్‌గౌడు, సర్పంచ్‌లు కృష్ణయ్యగౌడు, సూర్యగౌడు, నల్లన్నగౌడు, ఆంజనేయులుగౌడు, రాణి వీరేష్‌గౌడు పాల్గొన్నారు. 

అయిజ : అయిజలో గురువారం సర్వాయిపాపన్నగౌడు జయంతిని నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్క ర్‌ విగ్రహం వద్ద పాపన్నగౌడు చిత్రపటాన్ని ఉంచి, పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వీరే ష్‌, సత్యం, మహేంద్రగౌడు, రాఘవేంద్రగౌడు, తిమ్మప్ప, శ్రీనివాసులు, రఘుగౌడు, యోగేంద్ర, అగ్ని, బడేసాబ్‌ పాల్గొన్నారు. 


గొప్ప యోధుడు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

వడ్డేపల్లి : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ గొప్ప యోధుడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కొనియాడారు.  గౌడసంఘం నాయకుడు మధుసూదన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో వడ్డేపల్లిలో గురువారం సర్దార్‌ సర్వా యి పాపన్న గౌడ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో వడ్డేపల్లి మండల అధ్యక్షుడు నరసింహులు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాగమద్దిలేటి, వరప్రసాద్‌ రావు, బీజేపీ సీనియర్‌ నాయకులు వెంకటేష్‌యాదవ్‌, ఈశ్వరయ్య, బీజేవైఎం అయిజ మండల అధ్యక్షుడు అంజి, రవికుమార్‌, వనన్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.


    - శాంతినగర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో సర్వాయి సర్దార్‌ పాపన్నగౌడ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో గౌడ సంఘం కార్యదర్శి కాశీంగౌడ్‌, జి.వెంకట్రామన్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రాజోలి చంద్ర శేఖర్‌, మండల ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శులు, వీరేష్‌గౌడ్‌, జయన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌గౌడ్‌, సురేష్‌గౌడ్‌, రవిగౌడ్‌, కృష్ణ గౌడ్‌, శ్రీనివాసులు గౌడ్‌, బుడమొర్సు మురళిగౌడ్‌, తిప్పన్న గౌడ్‌, లక్ష్మణ గౌడ్‌ పాల్గొన్నారు.


బహుజన వీరుడు పాపన్న గౌడ్‌

గద్వాల టౌన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న నిజమైన బహుజన వీరుడని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ కొనియాడారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని  గురువారం పట్టణంలోని యూ నియన్‌ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నరేష్‌, కిష్టన్న, ఉలిగెప్ప, వెంకటేష్‌, తిమ్మప్ప పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:21:09+05:30 IST