భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-19T05:45:39+05:30 IST

భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శమని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ అన్నారు.

భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శం
కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్నకు నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ హరిచందన, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

 - జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

- కలెక్టర్‌ హరిచందనతో కలిసి 

  పాపన్న చిత్రపటానికి నివాళి

- జిల్లా వ్యాప్తంగా గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి జయంతి వేడుకలు

నారాయణపేటటౌన్‌/నారాయణపేట ,ఆగస్టు 18: భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శమని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ అన్నారు. కలెక్టరేట్‌ లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా వెనుక బడిన తరగ తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం  సర్వా యి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్‌ చిత్రపటానికి కలెక్టర్‌ హరిచందనతో కలిసి జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. పాపన్న గౌడ్‌ జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడాన్ని ఆమె స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలి పారు. మొదటిసారిగా సర్వాయి పాపన్న గౌడ్‌ జ యంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్‌  అన్నారు. కార్యక్రమంలో అదనపు రకలెక్టర్‌ పద్మజా రాణి, అబ్కారి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ నారాయ ణ, ఎస్‌ఐలు నాగేందర్‌, బాలకృష్ణ, గౌడ సంఘం సభ్యులు, బీసీ వసతి గృహ సంక్షేమ అధి కారులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌లో..

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 372వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. వెనుక బడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహానీయుడు పాపన్న గౌడ్‌ అని, భూ స్వాముల అక్రమ సంపాదనను దోచి పేద లకు పంచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో  గౌడ సంఘం జిల్లా నాయకుడు ఆంజనేయులు గౌడ్‌, మ క్తల్‌ మాజీ ఏఎంసీ చైర్మన్‌ నర్సింహ గౌడ్‌, విజయ్‌, చెన్నయ్య, అశోక్‌, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:45:39+05:30 IST