ప్రమాదవశాత్తు బావిలోపడి సర్వేయర్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-18T06:03:43+05:30 IST

మండల పరిధిలో ఇసుకదర్శి పంచాయతీ పరిధిలో హైవే సమీపంలో పొలాల్లోని నేలబావిలో శనివారం మైలా నాగమ్మ (24) అనే వివాహిత మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఎస్‌ఐ పి.చౌడయ్య తెలిపారు.

ప్రమాదవశాత్తు బావిలోపడి   సర్వేయర్‌ మృతి


మార్టూరు,  ఏప్రిల్‌ 17: మండల పరిధిలో ఇసుకదర్శి పంచాయతీ పరిధిలో హైవే సమీపంలో పొలాల్లోని నేలబావిలో శనివారం మైలా నాగమ్మ (24) అనే వివాహిత మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఎస్‌ఐ పి.చౌడయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఆయన కథనం ప్రకారం.. మార్టూరు గ్రామానికి చెందిన నాగమ్మ ద్రోణాదుల 1వ సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త లెనిన్‌బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి మృతురాలు కని పించడంలేదని కుటుంబసభ్యులు వెతికినట్లు తెలిసింది. శనివారం ఉదయం పొ లం పనికి వచ్చిన వారు నేలబావి వద్ద చెప్పులు, చున్నిని గమనించి పోలీసులకు తెలిపారు. దాంతో ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి బావిలో గాలించి, మృతదేహాన్ని బ యటకు తీయించారు. నాగమ్మ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్టు ఆమె తండ్రి నాగేశ్వరరావు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.  వైసీ పీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో నాగమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళుల ర్పిం చారు. ఆమె కుటుం బసభ్యులను పరామర్శించారు. తహసీల్దార్‌ ఈదా వెం కట రెడ్డి,  సర్వేయరు సుబ్బారావు, ఉద్యోగులు, నాయకులు పరామర్శించారు. ప్రమా దానికి కారణమైన కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు.   


Updated Date - 2021-04-18T06:03:43+05:30 IST