జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకోలేను : శశికళ

Jun 16 2021 @ 21:40PM

చెన్నై : వీకే శశికళకు సంబంధించిన మరో ఆడియో బయటికి వచ్చింది. ప్రస్తుతం పార్టీ సరైన దిశలో నడవడం లేదని, సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందని ఆ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. ‘‘లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వస్తాను. చింతించకండి. మహమ్మారి ముగిసిన తర్వాత మళ్లీ వస్తా’’ అన్న మాటలు ఆ ఆడియోలో ఉన్నాయి. అయితే ఈ ఆడియో టేపుల రాజకీయంపై అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆడియో టేపు రాజకీయాలు మానుకోవాలని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఈ విషయంలో ఆమె ఎన్నడూ విజయం సాధించలేరని, ఆమె తమ పార్టీ సభ్యురాలు కూడా కాదని జయకుమార్ పేర్కొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.