Sasikala హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-06T17:24:58+05:30 IST

అన్నాడీఎంకే కార్యకర్తలపై దాడులు జరిపితే ఏ మాత్రం సహించనంటూ ఆ పార్టీ నేతలను అసమ్మతివర్గం నాయకు రాలు శశికళ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఐదో వర్థంతి సందర్భంగా ఆమె ఓ ప్రకటనను జారీ చేశారు. గత రెండు

Sasikala హెచ్చరిక

చెన్నై: అన్నాడీఎంకే కార్యకర్తలపై దాడులు జరిపితే ఏ మాత్రం సహించనంటూ ఆ పార్టీ నేతలను అసమ్మతివర్గం నాయకు రాలు శశికళ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఐదో వర్థంతి సందర్భంగా ఆమె ఓ ప్రకటనను జారీ చేశారు. గత రెండు రోజులుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలపై జరిగిన దాడులు గురించి తెలుసుకుని తాను దిగ్ర్భాంతి చెందానని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఆ రెండు పదవులకు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ పన్నీర్‌సెల్వం నామినేషన్లు దాఖలు చేశారు. ఆ పదవులకు పోటీ చేయడానికి శనివారం నామినేషన్‌ వేయడానికి వెళ్ళి ఓంపొడి ప్రసాద్‌, ఆదివారం వెళ్ళిన రాజేష్‌ అనే కార్యకర్తపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి జరిపి తరిమికొట్టారు. ఈ సంఘటనపై స్పందించిన శశికళ అన్నాడీఎంకేకు కార్యకర్తలే మూలస్తంభాల వంటివారని, వారు లేకుంటే పార్టీ మనుగడే లేదని తెలిపారు. ప్రస్తుతం నాయకులుగా ఉన్నవారు పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి జయలలితలా కార్యకర్తలను ఆదరించడానికి బదులుగా వారిని శత్రువుల్లా పరిగణించి దాడులకు పాల్పడటం గర్హనీయమని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-06T17:24:58+05:30 IST