రియాద్‌లో అంగరంగ వైభవంగా సాటా తెలుగు దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-09-26T13:41:37+05:30 IST

విశాఖపట్టణం నగరానికి చెందిన 66 ఏళ్ళ కె. స్వరూప నుండి మోదలు నెల్లూరు నగరానికి చెందిన 8 ఏళ్ళ చిన్నారి తాటి నాగ హనీష వరకు అందరి ముఖాలలో ఆనందభరితమైన కాంతి, ఉప్పొంగుతున్న ఉత్సాహాం దానికంటె మించి ఆత్మీయుతను తలిపించె తెలు

రియాద్‌లో అంగరంగ వైభవంగా సాటా తెలుగు దినోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విశాఖపట్టణం నగరానికి చెందిన 66 ఏళ్ళ కె. స్వరూప నుండి మోదలు నెల్లూరు నగరానికి చెందిన 8 ఏళ్ళ చిన్నారి తాటి నాగ హనీష వరకు అందరి ముఖాలలో ఆనందభరితమైన కాంతి, ఉప్పొంగుతున్న ఉత్సాహాం దానికంటె మించి ఆత్మీయుతను తలిపించె తెలుగుదనం.. ఇదీ రియాద్‌లో శుక్రవారం సాటా ( సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) రంగవైభవంగా నిర్వహించిన తెలుగు దినోత్సవ వేడుకలో ప్రస్పుటించిన దృష్యాలు.



సాటా కార్యక్రమానికి రావడం ద్వారా తనకు ఘర్ వాపసీ అనుభూతి కల్గిందని హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫ్ జర్నలిస్ట్ కె.యం.వాసిఫ్ అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైద్రాబాద్‌లో విన్న ‘మా తెలుగుతల్లికు మల్లెపూ దండ’ గేయాన్ని 32 ఏళ్ళ తర్వాత తాను రియాద్‌లో ఈ కార్యక్రమ సందర్భంగా వినడం జరిగిందని ఆయన పెర్కోనారు. ఎడారి ప్రవాసంలో ప్రప్రథమంగా పండుగ జరుపుకొంటున్న సంతోషం ఉందని తూర్పు గోదావరి జిల్లా లక్కవరం చెందిన రమ్య, శ్రీకాకుళం జిల్లా టెక్కలికు చెందిన చందన వ్యాఖ్యానించారు. సాటా కార్యవర్గంలోని ప్రతి ఒక్కరి కృషి వలన ఈ కార్యక్రమం సాధ్యమైందని సాటా అధ్యక్షుడు మల్లేషన్ మరియు రియాధ్ ప్రాంత బాధ్యులు ఆనందరాజు, ముజమ్మీల్ అన్నారు. తోటి తెలుగు వారిని కలువడానికి 950 కిలోమీటర్ల దూరంలోని నజ్రాన్, అభాల నుండి వచ్చినట్లుగా తిరుపతికి చెందిన డాక్టర్ భాస్కర్ రెడ్డి మరియు మచిలీపట్నంకు చెందిన మజ్హార్ అన్నారు. 


మాతృభూమికి దూరంగా తమ మాతృభాష కొరకు తెలుగువారందరు సమావేశం కావడం సంతోషకరమని ప్రత్యేక అతిథిగా పాల్గొన్న భారతీయ ఎంబసీ అధికారి అనిల్ రాథోరీ అన్నారు. సరయూ నదీ తీరాన ఆయోధ్యలో శ్రీరాముడు జన్మించిన చోట నుండి తమిళనాడులోని రామసేతు వరకు భారతదేశం విభిన్న భాషాలకు నెలవని పాత్రికేయుడు మోహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. తనకు తెలుగు భాష ఏమి అర్ధం కాకున్నా సభికుల ముఖకవళికల ద్వార భాష పట్ల తెలుగు వారికి ఉన్న అభిమానాన్ని గమనించానని, ప్రవాసీ ప్రముఖుడు రాజస్థాన్‌కు చెందిన గులాం మోహమ్మద్ పేర్కొన్నారు.  ఃఇదే స్ఫూర్తితో భాషను పరిరక్షించాలని మరో ప్రముఖుడు తమిళనాడుకు చెందిన జయరాం అభిలాషించారు. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అనే దానితో సంబంధం లేకుండా తెలుగుదనం అందర్నీ కలుపుతుందని తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ అబ్దుల్ జబ్బార్ అన్నారు.


ఈ కార్యక్రమానికి సాటా మహిళ అధ్యక్షురాలు డాక్టర్ చాంద్ పర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహారించారు. ఈ సందర్భంగా గాయకుడు అంజద్ హుస్సేన్ పాడిన సినీ పాటలు సభికులను అలరింపజేసింది. రియాద్‌కు చెందిన తెలుగు గాయిని శ్రీవాణి కూడ తోడయ్యారు. చెవిరెడ్డి శివారెడ్డి, వసంత మరియు దాసరి భారతీలు  ప్రదర్శించిన తెలుగు నాటకం భాష సంస్కృతిను ప్రతిబింబించింది. భాష ప్రేమకు ఎల్లలు అడ్డంకి కావని, మనస్సుంటె చాలని నల్గోండ జిల్లా భువనగిరికి చెందిన మోహమ్మద్ షంస్ నిర్వహకులను అభినందించారు. ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసారు. షటిల్ పోటీలలో (పురుషులు) సూర్య శర్మ (ప్రథమ స్థానం) రాజేశ్ నాగేశ్వర రావు ( ద్వితీయ స్థానం) శ్రీపాద శ్రీహరి (తృతీయ స్థానం)లో నిలిచారు.


అలాగే మహిళలలో శిల్ప ఇందిరా ( ప్రథమ స్థానం) సురేఖ అపర్ణ (ద్వితీయ స్థానం) రమ్యశ్రీ (తృతీయ స్థానం)లో నిలిచారు. బాలబాలికలలో సాయి రిత్విక్, హేం నిఖిల్, వినేష్ చిన్న సంకల్ప్, ముదస్సీర్ మనస్, మన్సూరిలు చెస్ పోటిలలో దువ్వూరు రాజశేఖర్ రెడ్డి (ప్రథమ స్థానం) రాజేశ్ గాజుల (ద్వితీయ స్థానం) సుభాన్ కోలగాటల (తృతీయ స్థానం) మహిళలలో బిందు భాస్కర్, మాధవి, రూప, రేఖలు గెలిచారు. క్యారం పోటీలలో నిరంజన్ శ్రీనివాసరెడ్డి (ప్రథమ స్థానం) రఘునాథ మూర్తి జగదీష్ (ద్వితీయ స్థానం) మహేంద్ర వాకటి, బాలు చింతలపూడి మహిళలలో అర్చన, గీతా శ్రీనివాస్, మాధవి లతా సూర్య (ద్వితీయ స్థానం) సంధ్య మంజుల (తృతీయ స్ధానం) ఇక క్రికెట్‌లో నరేంద్ర పల్లేరు, మహేంద్ర వాకటి, సూర్య మరియు నాగార్జునలు విజేతలుగా నిలిచారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా కొంత మంది తల్లిదండ్రులు వేదిక ప్రక్కనే నిల్చుండి నిర్వహాకులపై ఒత్తిడి తీసుకోరావడం మరియు పదేపదే వేదిక వద్దకు వెళ్ళడంతో ఒకింత సభికులు అసహానానికి గురయ్యారు.


బలమైన అరబ్బు తెగల సంప్రదాయనికి నెలవైన నజద్ ప్రాంతంలో సాధారణంగా స్థానిక అరబ్బి సంప్రదాయాలకు అనుగుణంగా మాత్రమే సాంఘీక జీవన విధానం ఉంటుంది. అలాంటి నజద్‌లోని రియాద్ నగరంలో ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్విరామంగా జరిగిన ఈ తెలుగు దినోత్సవ వేడుకలలో రియాద్ నగరంలో నివాసముంటున్న వందలాది కుటుంబాలు ఆసక్తితో పాల్గోన్నాయి. చిందులేసే చిన్నారులు, దగ్గరి బంధువుల వివాహానికి వచ్చినట్లుగా పట్టు చీరలు ధరించి మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత సెలువు రోజు అలసట తీరినట్లుగా హాయిగా కూర్చున్న పురుషులు అందరూ కలిసి ఆత్మీయంగా తెలుగుదనం గూర్చి మాట్లాడుకోవడం చూడముచ్చటగా కనిపించింది. ఎనిమిది సంవత్సరాల నుండి రియాద్ నగరంలో ఉంటున్న తనకు ఈ ఎడారి నగరంలో ఈ స్ధాయిలో తెలుగు కుటుంబాలు ఉంటున్నట్లుగా తెలిసి అశ్చర్యపోయానని నెల్లూరు జిల్లాకు చెందిన గీతా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 



తెలుగు ప్రవాసీ ప్రముఖుడు, సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఖమ్మం జిల్లాకు చెందిన మద్దినేని జయరావు మాట్లాడుతూ రాజధాని రియాధ్ పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది తెలుగు ప్రవాసీయులు ఒక గొడుగు కింద గుమిగూడడం తెలుగు వారి సామాజిక ప్రాబల్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆజాదీ కా అమృత్ మహత్సోవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న ప్రవాసీయులు వివిధ కార్యక్రమాలను నిర్వహించగా తాము తెలుగు దినోత్సవాన్ని నిర్వహించినట్లుగా సాటా అధ్యక్షుడు మల్లేశ్ పెర్కోన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులకు కష్టకాలంలో భారతీయ ఎంబసీ చేస్తున్న సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.









Updated Date - 2022-09-26T13:41:37+05:30 IST