ఉపగ్రహం.. నలుగురు తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2021-02-28T09:06:57+05:30 IST

పీఎ్‌సఎల్‌వీ-సీ51 రాకెట్‌లో పంపనున్న 19 ఉపగ్రహాల్లో ఒకటైన సతీశ్‌ ధావన్‌ శాట్‌ను రూపొందించింది ఏడుగురు విద్యార్ధులు

ఉపగ్రహం.. నలుగురు తెలుగు విద్యార్థులు

తిరుపతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పీఎ్‌సఎల్‌వీ-సీ51 రాకెట్‌లో పంపనున్న 19 ఉపగ్రహాల్లో ఒకటైన సతీశ్‌ ధావన్‌ శాట్‌ను రూపొందించింది ఏడుగురు విద్యార్ధులు. వీరిలో యజ్ఞసాయి, రఘుపతిది తిరుపతి. కీర్తిచంద్‌  హైదరాబాద్‌ వాసి, అబ్దుల్‌ కషిఫ్‌ నల్లగొండకు చెందినవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యజ్ఞసాయి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. రఘుపతి హమాలీ కుమారుడు. ఎంటెక్‌ చేశాడు. వీరంతా.. అంతరిక్షం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణనిచ్చే స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థలో చేరారు. 2017లో కలాం శాట్‌ను, 2018లో కలాం శాట్‌-వి2ను ఈ సంస్థ ఇస్రోతో కలిసి అంతరిక్షంలోకి పంపింది. సంస్థ సీఈవో కేశన్‌ నేతృత్వంలో ఏడుగురు విద్యార్థులు 1.9 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది పూర్తిగా కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. భూమికి 530 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ పవర్‌తో ఎక్కువ డేటా వినియోగంపై పరిశోధనలు చేస్తుంది. 

Updated Date - 2021-02-28T09:06:57+05:30 IST