సత్తెనపల్లిలో యువతి గొంతు కోసిన నిందితుడు అరెస్ట్
ABN , First Publish Date - 2022-04-17T21:31:32+05:30 IST
సత్తెనపల్లిలో యువతి గొంతు కోసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఫాతిమాతో తులసీరామ్ అనే వ్యక్తి
పల్నాడు: సత్తెనపల్లిలో యువతి గొంతు కోసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఫాతిమాతో తులసీరామ్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఫాతిమా కోరడంతో గొంతుకోసి తులసీరామ్ పరారైనాడు, చెక్పోస్ట్ దగ్గర తులసీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.