సాత్విక్‌కు ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-05-24T06:11:38+05:30 IST

థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన షటిల్‌ బ్యాడ్మింటన క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ను ఘనంగా సత్కరించారు. మెట్రోకెమ్‌ అధినేత నందెపు బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం సాత్విక్‌తో పాటు ఆయన తల్లిదండ్రులైన రంగమణి, కాశీవిశ్వనాథంలను సత్కరించారు.

సాత్విక్‌కు ఘన సన్మానం
సాత్విక్‌ సాయిరాజ్‌ను సత్కరిస్తున్న రమణబాబు

అమలాపురం టౌన, మే 23: థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన షటిల్‌ బ్యాడ్మింటన క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ను ఘనంగా సత్కరించారు. మెట్రోకెమ్‌ అధినేత నందెపు బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం సాత్విక్‌తో పాటు ఆయన తల్లిదండ్రులైన రంగమణి, కాశీవిశ్వనాథంలను సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కోనసీమ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అమలాపురం ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఉడెన షటిల్‌ కోర్టు నిర్మాణానికి రూ.6 లక్షలు అందించనున్నట్టు బాలాజీ ప్రకటించారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన అసోసియేషన అధ్యక్షుడు మెట్ల రమణబాబు, అల్లాడ శరతబాబు, గంధం పల్లంరాజు, సత్తి శ్రీను, నల్లా చిన్నా, గోకరకొండ సూరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:11:38+05:30 IST