బయ్యారం గనులను విశాఖ స్టీల్‌కు కేటాయించాలి: సత్య కుమార్

ABN , First Publish Date - 2021-03-13T21:57:25+05:30 IST

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బయ్యారం గనులను విశాఖ స్టీల్‌కు కేటాయించాలి: సత్య కుమార్

విజయవాడ: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పరిశ్రమపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు సత్య కుమార్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపై కేటీఆర్‌కు ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న బయ్యారం గనులను విశాఖ స్టీల్‌కు కేటాయిం చాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు అంటూ కేటీఆర్‌ కబుర్లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్‌ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ఉక్కు పరిశ్రమపై చర్చించాలన్నారు.

 

రెండు రాష్ట్రా ప్రభుత్వాలు చర్చించి ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి నడపాలని సత్యకుమార్  వ్యాఖ్యానించారు. వరదల్లో దెబ్బతిన్నబాధితులను ఆదుకొని కేటీఆర్‌ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందని సత్య కుమార్ అన్నారు.ఆంధ్రులను తరిమికొడతామన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడేళ్లుగా ఫార్మ్‌హౌస్‌లో కూర్చున్న కేసీఆర్ మాటలు వినాల్సిన అవసరం లేదని సత్యకుమార్ చెప్పారు.

 ఏపీ ప్రభుత్వం కూడా ఉక్కు పరిశ్రమపై ప్రేమ ఉంటే గనుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చెయ్యటం లేదా? అని సత్యకుమార్  ప్రశ్నించారు. నలభై ఏళ్ల క్రితం ఉక్కు పరిశ్రమలో భూములు కోల్పోయిన  రైతుల కోసం రాజకీయ పార్టీలు ఎందుకు పోరాటం చేయడం లేదని సత్య కుమార్  ప్రశ్నించారు. ఆంధ్రుల సెంటిమెంట్ ను బీజేపీ గౌరవిస్తుందని చెప్పారు. రాజకీయ స్వలాభం కోసం విశాఖ ఉక్కు పోరాటం చేస్తున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వంతో చర్చిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ చేయొద్దంటూ బీజేపీ ఏపీ నేతలు ఢిల్లీలో పెద్దలను కలిశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జెండా ‌పీకేయడం ఖాయమని సత్య కుమార్ ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి  సంబంధించిన  విధాన పరమైన నిర్ణయం తీసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తుందని సత్యకుమార్ పేర్కొన్నారు.

Read more