‘అగ్నిపథ్‌’ రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2022-06-28T04:15:20+05:30 IST

అత్యంత ప్రాధాన్యమైన దేశ భద్రతను మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం ఐబీ చౌరస్తాలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సత్యగ్రహ దీక్షలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ రక్షణ రంగంలో కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం చేయడం వల్ల దేశ భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు.

‘అగ్నిపథ్‌’ రద్దు చేయాలని సత్యాగ్రహ దీక్ష
సత్యగ్రహ దీక్షలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

ఏసీసీ, జూన్‌ 27: అత్యంత ప్రాధాన్యమైన దేశ భద్రతను మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం  ఐబీ చౌరస్తాలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సత్యగ్రహ దీక్షలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఆమె మాట్లాడుతూ రక్షణ రంగంలో కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకం చేయడం వల్ల దేశ భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమించుకుని 6 నెలల శిక్షణ ఇచ్చి మూడున్నర సంవత్సరాలు సైన్యంలో కొనసాగిం చి తిరిగి ఇంటికి పంపిస్తే ఆపై వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాలుగేండ్లకు ఒకసారి కొత్త వారిని తీసుకోవడం వల్ల వారికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చును దేశం భరించాల్సి వస్తుందన్నారు.  ఇప్పటికే విద్య, వైద్య రంగాల్లో కాంట్రాక్టు పద్ధతిని అవలంభించడం వల్ల దేశం నష్టపోతుందన్నారు.  యువత అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు చిట్ల సత్య నారాయణ, పూదరి తిరుపతి, బండారి సుధాకర్‌, హేమలత, పెంట రజిత, నరేష్‌, వేణు పాల్గొన్నారు.

చెన్నూరు:  నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లే అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొ న్నారు. సోమవారం  పాత తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు నూకల రమేష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సత్యగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని, వెంటనే ఉద్యో గాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టిం చుకోవడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచుతూ సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితులను కల్పిస్తున్నాయన్నారు. మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ అధ్యక్షుడు కుర్మ రాజమల్లగౌడ్‌, గోపతి రాజయ్య, మహేష్‌ తివారీ, చెన్నూరి శ్రీధర్‌, బాపగౌడ్‌, ఖలీల్‌, సుధాకర్‌రెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని రద్దుచేయాలని పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు సత్యగ్రహ దీక్ష చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం అగ్నిపథ్‌ పథకం తీసుకువచ్చి నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. ప్రజల సమస్యలను పట్టించు కోకుండా దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్డడానికి చూస్తున్నాడని పేర్కొన్నారు.  నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-28T04:15:20+05:30 IST