సత్యనారాయణమూర్తి తీర్థానికి పోటెత్తిన జనం
దేవరాపల్లి, జనవరి 23: మండలంలోని పెదనందిపల్లి విజయ వెంకట సత్యనారాయణమూర్తి తీర్థానికి విశాఖ, విజయనగరం జిల్లాల నలుమూలలు నుంచి భక్త్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం వేకువ జాము నుంచి భక్తులు పూజలు చేశారు. ఎస్ఐ పి.సింహాచలం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.