Saudi Arabia: ఒకే ఏడాదిలో 8లక్షలకు పైగా Work Visa ల జారీ

ABN , First Publish Date - 2022-06-08T14:04:22+05:30 IST

సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2021లో 8లక్షలకు పైగా Work visa లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Saudi Arabia: ఒకే ఏడాదిలో 8లక్షలకు పైగా Work Visa ల జారీ

రియాద్: సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2021లో 8లక్షలకు పైగా Work visa లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గతేడాది కొత్తగా 6,600 మంది గృహ కార్మికులు దేశంలో ప్రవేశానికి అమనుమతి పొందగా, 6,400 మంది డొమెస్టిక్ వర్కర్లు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక వుదియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఏకంగా లక్ష 44వేల కేసులను సెటిల్ చేసినట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఈ సెటిల్‌మెంట్ల ద్వారా కార్మికులు మొత్తం 444.6 మిలియన్ సౌదీ రియాళ్లు(సుమారు రూ.920కోట్లు) పొందడం జరిగింది. అలాగే 73 శాతానికి పైగా లేబర్ కేసులు సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక Qiwa ప్లాట్‌ఫారమ్ ద్వారా 74 కొత్త సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. 95 శాతం వినియోగదారుల అవసరాలను ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా కవర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 

Updated Date - 2022-06-08T14:04:22+05:30 IST