Saudi: విదేశీ యాత్రికుల హజ్ కోటా ప్రకటన.. ఈ ఏడాది భారత్ నుంచి ఎంతమంది హజ్ యాత్రకు వెళ్లనున్నారంటే..

ABN , First Publish Date - 2022-04-24T14:34:22+05:30 IST

2022 ఏడాదికి గాను సౌదీ అరేబియా విదేశీ యాత్రికుల కోసం హజ్ కోటాను ప్రకటించింది.

Saudi: విదేశీ యాత్రికుల హజ్ కోటా ప్రకటన.. ఈ ఏడాది భారత్ నుంచి ఎంతమంది హజ్ యాత్రకు వెళ్లనున్నారంటే..

రియాద్: 2022 ఏడాదికి గాను సౌదీ అరేబియా విదేశీ యాత్రికుల కోసం హజ్ కోటాలను ప్రకటించింది. ఈ కోటాలకు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఆమోదించిందని అక్కడి మీడియా పేర్కొంది. అధికారిక సమాచారం ప్రకారం అత్యధిక  ముస్లిం జనాభా కలిగిన దేశమైన ఇండోనేషియా అత్యధిక సంఖ్యలో హజ్ యాత్రికులతో సింహభాగం పొందింది. మంత్రిత్వ శాఖ ఇండోనేషియాకు 1,00,051 కోటాను కేటాయించింది. ఇండోనేషియా తర్వాత పాకిస్థాన్ నుంచి 81,132 మంది యాత్రికులకు అనుమతి ఇచ్చింది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 79,237 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి 57,585 మందికి అవకాశం కల్పించింది. 


ఆ తర్వాత వరుసగా నైజీరియా( 43,008), ఈజిప్ట్(35,375), ఇరాన్(38,481), టర్కీ(37,770), రష్యా(11,318), యూఎస్(9,504), చైనా(9,190), థాయ్‌లాండ్(5,885), ఉక్రెయిన్(91), అంగోలా(23) మంది యాత్రికులు ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. కాగా, ఈ ఏడాది హజ్‌కు అనుమతించబడే పది లక్షల మందిలో 85 శాతం మంది విదేశీ యాత్రికులు ఉంటారని మంత్రిత్వ శాఖ ముందుగా ప్రకటించింది. కానీ, ప్రస్తుతం నమోదైన మొత్తం 8,50,000 మంది విదేశీ యాత్రికుల సంఖ్య కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందు ప్రతి దేశానికి కేటాయించిన యాత్రికుల వాస్తవ కోటాలో 45.2 శాతం మాత్రమే. ఇక 65 ఏళ్లకు పైబడిన యాత్రికులకు ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతి లేదు. అలాగే హజ్ చేయాలనుకునే వారు రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకుని ఉండాలి.   

Updated Date - 2022-04-24T14:34:22+05:30 IST