Saudi Arabia: సౌదీ రాజు దాతృత్వం.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన కడప చిన్నారులకు సాయం

ABN , First Publish Date - 2022-07-30T13:24:36+05:30 IST

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులకు ఎట్టకేలకు సాయం అందింది. వారిని ఆదుకునేందుకు సౌదీ అరేబియా రాజు దాతృత్వం చూపినా.. సాయం అందించడానికి అవరోధం ఏర్పడింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అడ్డంకులు తొలగిపోయి చిన్నారులకు నగదు అందింది. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా అట్లూరు మండలం...

Saudi Arabia: సౌదీ రాజు దాతృత్వం.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన కడప చిన్నారులకు సాయం

చిన్నారులకు సౌదీ సాయం

ఐదేళ్ల క్రితం క్షిపణి దాడిలో తండ్రి మృతి

స్వగ్రామంలో తల్లి ఆత్మహత్య

స్పందించిన సౌదీ రాజు ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో డబ్బు జమ 

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులకు ఎట్టకేలకు సాయం అందింది. వారిని ఆదుకునేందుకు సౌదీ అరేబియా రాజు దాతృత్వం చూపినా.. సాయం అందించడానికి అవరోధం ఏర్పడింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అడ్డంకులు తొలగిపోయి చిన్నారులకు నగదు అందింది. వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన ఎ.వెంకటసుబ్బారెడ్డి ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. 2017 ఏప్రిల్‌లో నజ్రాన్‌ అనే పట్టణంలో ఆయన కారు శుభ్రం చేస్తుండగా.. పొరుగు దేశం యెమెన్‌ నుంచి ఇరాన్‌ మద్దతుతో హౌతీ ఉగ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో మరణించాడు. అప్పు లు తీర్చడం కోసం విదేశాలకు వెళ్లిన వెంకటసుబ్బారెడ్డి మరణవార్త విని ఆయన భార్య ఈశ్వరమ్మ తీవ్రంగా కలత చెందింది. స్వగ్రామంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ దంపతుల చిన్నారులు మోహన్‌, వెంకట్‌ అనాథలయ్యారు.


తమ దేశానికి పొట్టకూటి కోసం వచ్చి శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడి కుటుంబానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ సాయం ప్రకటించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించా రు. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం మృతుడి కు టుంబానికి సుమారు 40 లక్షల రూపాయలు మం జూరు చేసింది. అయితే ఆ డబ్బు చిన్నారులకు అం దించడంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఇద్దరూ మైనర్లు కావడం, వారికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో డబ్బు పంపడంలో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో.. కువైట్‌లో పనిచేస్తున్న అదే జిల్లాకు చెందిన ప్రవాసీ సామాజిక కార్యకర్త దుగ్గీ గంగాధర్‌ స్పందించారు. చిన్నారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో డబ్బు నేరుగా వారికి అందింది. భారత కాన్సులేట్‌ అధికారులు కూడా చిన్నారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి సాయం అందేలా చేశారు. 

Updated Date - 2022-07-30T13:24:36+05:30 IST