కువైత్ బాటలో Saudi Arabia.. ప్రవాసుల ప్రాబల్యం తగ్గించేందుకు సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-24T18:09:02+05:30 IST

ఇప్పటికే కువైత్ ప్రవాసుల ప్రాబల్యం తగ్గించేందుకు 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకువచ్చింది.

కువైత్ బాటలో Saudi Arabia.. ప్రవాసుల ప్రాబల్యం తగ్గించేందుకు సంచలన నిర్ణయం

రియాద్: ఇప్పటికే కువైత్ ప్రవాసుల ప్రాబల్యం తగ్గించేందుకు 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకువచ్చింది. దీని ద్వారా గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని సంస్థల్లో భారీ సంఖ్యలో దేశ పౌరులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇప్పుడు కువైత్ బాటలో సౌదీ అరేబియా పయనిస్తోంది. స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని ఉద్యోగాలను కేవలం స్థానికులకే ఇవ్వాలనే ఉద్దేశంతో మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) తాజాగా ఆరు కీలక నిబంధనలు తీసుకువచ్చింది. కింగ్‌డమ్ వ్యాప్తంగా ఉన్న ఏవియేషన్, ఆప్టిక్స్, కస్టమర్ సర్వీస్, రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్ యాక్టివిటీస్, పోస్టల్, పార్శిల్ డెలివరీ సర్వీస్‌ల అవుట్‌లెట్‌లలో సౌదీ పౌరులతోనే నియామకాలు చేపట్టాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆయా రంగాల్లో సుమారు 33వేల మంది సౌదీ పౌరులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావిస్తోంది. 


లేబర్ మార్కెట్‌లో స్థానికుల సంఖ్యను పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని సౌదీ చెబుతోంది. ఇక ఏవియేషన్ ప్రొఫెషన్స్ స్థానీకరణ అనేది రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశ వచ్చే ఏడాది మార్చి 15న ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా కోపైలట్, ఎయిర్ కంట్రోలర్, ఎయిర్ హోస్ట్ ఫ్రొఫెషన్స్ ఇలా అన్ని స్థానాల్లో 60 శాతం మంది ఉద్యోగులను సౌదీ పౌరులనే నియమించనుంది. ఆ తర్వాత 2024 మార్చి 4న చేపట్టే రెండో దశలో 70 శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇలాగే మిగతా ఆప్టిక్స్, కస్టమర్ సర్వీస్, రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్ యాక్టివిటీస్, పోస్టల్, పార్శిల్ డెలివరీ రంగాల్లో దశలవారీగా సౌదీ పౌరులకు తొలి ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తద్వారా ఆయా రంగాల్లో ప్రవాసుల ప్రాబల్యం తగ్గుతుందనేది సౌదీ చెబుతున్నమాట. 


Updated Date - 2022-06-24T18:09:02+05:30 IST