Saudi Arabia: హజ్ యాత్రికుల కోసం కొత్త సర్వీస్
ABN , First Publish Date - 2022-06-30T19:00:01+05:30 IST
ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం సౌదీ అరేబియా (Saudi Arabia) 'హాలో డాక్టర్' (Holodoctor) పేరిట కొత్త సర్వీసును ప్రారంభించింది.
రియాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం సౌదీ అరేబియా (Saudi Arabia) 'హాలో డాక్టర్' (Holodoctor) పేరిట కొత్త సర్వీసును ప్రారంభించింది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్ అల్-జలాజెల్ ఈ సేవలను ప్రారంభించారు. సౌదీకి చెందిన టెలికమ్యూనికేషన్ కంపెనీ (STC) సహకారంతో వైద్య సంప్రదింపుల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలను అందించేందుకు 'హాలో డాక్టర్' సేవలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా మంత్రి ఫహద్ తెలిపారు. రియాద్‌లోని సెహా వర్చువల్ హాస్పిటల్‌తో రోగులకు అవసరమైన సేవలు అందుతాయన్నారు. 24 గంటలు ఈ ఆస్పత్రి ద్వారా ఎక్స్-రేలు, ఇతర సిరీయస్ మెడికల్ సమస్యలకు సంబంధించి సేవలు పొందవచ్చని చెప్పారు. అలాగే తనిఖీ, రోగ నిర్ధారణ, మందుల పంపిణీ కూడా ఈ సర్వీసులో భాగంగా అందజేయడం జరుగుతుందన్నారు. సమగ్ర ఆరోగ్య సౌకర్యాల వ్యవస్థ ద్వారా 1443 హిజ్రీ సంవత్సరం హజ్ సీజన్ కోసం ఆరోగ్య మంత్రిత్వశాఖ చాలా ముందు నుంచే అన్ని సిద్ధం చేసిందని మంత్రి పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆచారాలను నిర్వహించడానికి చొరవ చూపిన రెండు పవిత్ర మసీదుల సంరక్షుడు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్‌కు ఈ సందర్భంగా మంత్రి ఫహద్ అల్-జలాజెల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.