Saudi లో దారుణ ఘటన.. పనిమనిషిపై యజమాని లైంగిక వేధింపులు.. చివరికి

Nov 11 2021 @ 10:54AM

బురైధ్: సౌదీ అరేబియాలోని అల్ ఖాసీం ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. తన వద్ద పనిచేసే మహిళపై యజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హ్యుమన్ రిసోర్స్ విభాగం అధికారులు ఈ విషయాన్ని అల్ ఖాసీం పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ ముందు హాజరుపరచనున్నారు. న్యాయస్థానంలో అతడు దోషిగా తేలితే కఠిన చర్యలు ఉంటాయి. ఇక ఇలా లైంగిక వేధింపుల విషయంలో సౌదీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. కనుక సదరు యజమాని దోషిగా తేలితే మాత్రం కచ్చితంగా కఠిన చట్టాలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఖాసీం పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కాగా, నిందితుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.