భార్య‌పై అనుమానంతో ఆమె ఫోన్‌లో స్పైవేర్‌.. చివ‌రికి

ABN , First Publish Date - 2021-06-17T16:05:41+05:30 IST

భార్య‌పై అనుమానంతో ఆమె ఫోన్‌లో స్పైవేర్ పెట్టిన భ‌ర్త చివ‌ర‌కు రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టుబ‌డ్డ ఘ‌ట‌న సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది.

భార్య‌పై అనుమానంతో ఆమె ఫోన్‌లో స్పైవేర్‌.. చివ‌రికి

అబుధాబి: భార్య‌పై అనుమానంతో ఆమె ఫోన్‌లో స్పైవేర్ పెట్టిన భ‌ర్త చివ‌ర‌కు రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టుబ‌డ్డ ఘ‌ట‌న సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఎలాగైనా ఆమె ఫోన్ కాల్స్‌, సందేశాల‌ను ఆమెకు తెలియ‌కుండా తెలుసుకోవాల‌నే ఉద్దేశంతో ఓ స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. త‌న స్నేహితుడితో భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో త‌ర‌చూ ఆమెను వేధించేవాడు భ‌ర్త‌. ఈ క్ర‌మంలోనే భార్యకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొన్న‌ భ‌ర్త అందులో స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఇచ్చాడు. దాంతో కొన్ని రోజులుగా ఆమెకు తెలియ‌కుండా ఆమె ఫోన్‌కు వ‌చ్చే కాల్స్‌, సందేశాల‌ను గ‌మ‌నిస్తున్నాడు. ఇక‌ అనుమానం వ‌చ్చిన భార్య త‌న ఫోన్‌ను చెక్ చేసుకోవ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న‌కు తెలియ‌కుండా త‌న ఫోన్‌ను స్పై చేసిన భ‌ర్త.. త‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించాడ‌ని, విడాకులు కావాలంటూ భార్య కోర్టుకెక్కింది. సైబ‌ర్‌క్రైం పోరాట‌ చ‌ట్టం ప్ర‌కారం భ‌ర్త చేసిన ప‌ని నేరం కిందికే వ‌స్తుంద‌ని న్యాయ‌వాది అబ్దుల్ ర‌హ‌మాన్ అల్ హ‌ర్బి తెలిపారు. ఒకవేళ అత‌డు దోషిగా తెలితే ఏడాది జైలుతో పాటు 5ల‌క్ష‌ల రియాల్స్(రూ.98,15,162) జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌వాది చెప్పారు.  

Updated Date - 2021-06-17T16:05:41+05:30 IST