మ‌గ‌తోడు లేకుండానే మ‌హిళ‌లు హ‌జ్ యాత్ర చేసుకోవ‌చ్చు: సౌదీ

ABN , First Publish Date - 2021-06-15T16:20:35+05:30 IST

సౌదీ అరేబియా స‌ర్కార్ మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాదిలాగే ఈసారి కూడా దేశ‌ నివాసితుల‌కు అది కూడా కేవ‌లం 60వేల మందికి మాత్ర‌మే హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే.

మ‌గ‌తోడు లేకుండానే మ‌హిళ‌లు హ‌జ్ యాత్ర చేసుకోవ‌చ్చు: సౌదీ

రియాధ్‌: సౌదీ అరేబియా స‌ర్కార్ మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాదిలాగే ఈసారి కూడా దేశ‌ నివాసితుల‌కు అది కూడా కేవ‌లం 60వేల మందికి మాత్ర‌మే హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. తాజాగా హ‌జ్ యాత్రికుల విష‌యంలో సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ‌ల‌కు హజ్‌యాత్ర‌కు అనుమ‌తించిన సౌదీ.. మ‌గ‌తోడు లేకుండానే యాత్ర‌కు రావొచ్చ‌ని పేర్కొంది. పురుషుల‌పై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా మ‌హిళ‌లే యాత్ర కోసం త‌మ పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ‌జ్ అండ్ ఉమ్రా వెల్ల‌డించింది. "దేశీయ మ‌హిళ‌లు ఎవ‌రైతే హ‌జ్ యాత్ర‌కు రావాల‌నుకుంటున్నారో వారు మ‌గ‌తోడు లేకున్నా త‌మ పేర్లను సొంతంగా న‌మోదు చేసుకోవ‌చ్చు. మ‌రో మహిళ‌తో క‌లిసి హ‌జ్‌కు రావొచ్చు" అని మినిస్ట్రీ ఆఫ్ హ‌జ్ అండ్ ఉమ్రా ట్వీట్ చేసింది. ఇటీవ‌ల పురుషుల‌పై ఆధార‌ప‌డ‌కుండా మ‌హిళ‌లు ఒంట‌రిగా జీవ‌నం సాగించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన సౌదీ.. తాజాగా హ‌జ్ యాత్ర విష‌యంలోనూ మ‌హిళ‌ల‌కు ఇదే వెసులుబాటు క‌ల్పించింది. ఇక ఇప్ప‌టికే సౌదీ అరేబియా మ‌హిళ సాధికారిక‌త దిశ‌గా ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా 2019 మ‌హిళ‌లు మేల్ గార్డియ‌న్ అనుమ‌తి లేకుండా ఒంట‌రిగా ప్ర‌యాణించే వీలు క‌ల్పించింది. అలాగే 2017లో మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇటీవ‌లే 17 ఏళ్ల‌కు పైబ‌డిన అమ్మాయిలు సైతం డ్రైవింగ్ ప‌ర్మిట్లు పొందేందుకు సౌదీ అవ‌కాశం ఇచ్చింది.     

Updated Date - 2021-06-15T16:20:35+05:30 IST