పెరుగుతున్న చమురు ధరలు... సౌదీ అరామ్‌కో భారీ లాభాలు నమోదు

ABN , First Publish Date - 2022-05-15T23:05:46+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ధరల పెరుగుదల నుండి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ ‘సౌదీ అరామ్‌కో’ ప్రయోజనం పొందింది.

పెరుగుతున్న చమురు ధరలు...  సౌదీ అరామ్‌కో భారీ లాభాలు నమోదు

బహ్రెయిన్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ధరల పెరుగుదల నుండి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ ‘సౌదీ అరామ్‌కో’ ప్రయోజనం పొందింది. అరమ్‌కో ఇటీవలే యాపిల్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత పెరుగుతున్న చమురు ధరల నుండి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ ప్రయోజనాలను పొందుతున్న సౌదీ అరామ్‌కో ఆదివారం రికార్డు త్రైమాసిక లాభాలను నమోదు చేసింది.


ఈ(2022) ఏడాది మొదటి మూడు నెలల్లో కంపెనీ  నికరాదాయం 82 % పెరిగి, $39.5 బిలియన్లకు చేరుకుంది. గత వారం, Apple Inc.ని అధఇగమించి, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ $2.4 ట్రిలియన్లు. ఉక్రెయిన్ దండయాత్రతో పాటు పెరుగుతున్న చమురు ధరలు సౌదీ అరేబియా వంటి పెట్రోస్టేట్‌లకు ఎలా కలసివచ్చిందో చెప్పడానికి అరామ్‌కో లాభాలే ఉదాహరణ అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చమురు ధరలు ఇటీవలి నెలల్లో బ్యారెల్‌కు $139 వరకు పెరగడం, స్థిరంగా $100 కంటే ఎక్కువగా ఉండటంతో... సౌదీ అరేబియా ఒక దశాబ్దంలో దాని వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


సౌదీ అరేబియా స్థూల దేశీయోత్పత్తి మొదటి త్రైమాసికంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.6 % పెరిగింది. గణాంకాల ప్రకారం... లండన్‌కు చెందిన కన్సల్టింగ్ సంస్థ క్యాపిటల్ ఎకనామిక్స్ ఈ ఏడాది సౌదీ ఆర్థిక వ్యవస్థ దాదాపు 10 % వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం అంచనా వేసిన 6.3% వృద్ధి కంటే ఇది బలంగా ఉండడం గమనార్హం. కంపెనీ జనవరి-మార్చి మధ్య రోజుకు సగటున 10.2 మిలియన్ బ్యారెళ్లను పంప్ చేసింది.


ఇది ప్రపంచ రికార్డ్. Aramco తన త్రైమాసిక డివిడెండ్, సౌదీ ప్రభుత్వానికి కీలకమైన ఆదాయ వనరు. $18.8 బిలియన్ల వద్ద ఎటువంటి మార్పూ లేకుండా కొనసాగించగలగడంతోపాటు కంపెనీలో ఉన్న ప్రతి 10 షేర్లకు ఒక బోనస్ షేర్ పంపిణీని ఆమోదించడం విశేషం. సౌదీ ప్రభుత్వం, అరమ్‌కోలో 94% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. మరో ఎనిమిదేళ్కలో... అంటే... 2030 నాటికి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలనే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్  ప్రణాళికలో భాగంగా... చమురేతర పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగించాలని కోరింది. . ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహకరించేందుకు... ప్రిన్స్ మహ్మద్ హైడ్రోకార్బన్‌లతో సంబంధం లేని కంపెనీలు, పరిశ్రమల్లో  పెట్టుబడి పెట్టడానికి పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు బాధ్యతలనప్పగించారు. ప్రభుత్వం 2019 లో సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజీలో అరమ్‌కో సంబంధిత  ప్రారంభ పబ్లిక్ ఆఫర్ నుండి సేకరించిన $29.4 బిలియన్‌లను అమలు చేయడానికి PIFకు  బదిలీ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో... సౌదీ ప్రభుత్వం  హైడ్రోకార్బన్-ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరించే ప్రయత్నాలలో భాగంగా సుమారు $ 80 బిలియన్ల విలువైన Aramco షేర్లను PIFకి బదిలీ చేసినట్లు వినవస్తోంది.

Updated Date - 2022-05-15T23:05:46+05:30 IST