ఎయిర్‌లైన్లకు Saudi Arabia కీలక ఆదేశాలు.. ప్రయాణికులకు ఆ ఫీజు తిరిగి ఇచ్చేయాలంటూ..

ABN , First Publish Date - 2022-03-08T19:16:40+05:30 IST

కింగ్‌డమ్‌కు విమానాలు నడిపే అన్ని ఎయిర్‌లైన్లకు సౌదీ అరేబియా కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌లైన్లకు Saudi Arabia కీలక ఆదేశాలు.. ప్రయాణికులకు ఆ ఫీజు తిరిగి ఇచ్చేయాలంటూ..

రియాద్: కింగ్‌డమ్‌కు విమానాలు నడిపే అన్ని ఎయిర్‌లైన్లకు సౌదీ అరేబియా కీలక ఆదేశాలు జారీ చేసింది. విమాన టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికుల నుంచి తీసుకున్న ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు సంబంధించిన ఫీజులను తిరిగి వారికి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎందుకంటే ఈ నెల 5వ తేదీ(శనివారం) నుంచి సంస్థాగత నిర్బంధాన్ని సౌదీ సర్కార్ ఎత్తివేసింది. అందుకే ఈ తేదీ కంటే ముందు ప్రయాణికులు ఎవరైతే కింగ్‌డమ్ వచ్చేందుకు టికెట్ బుకింగ్ సమయంలో క్వారంటైన్ కోసం ఫీజు చెల్లించారో వారికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇక సౌదీకి వచ్చే ప్రయాణికులకు అక్కడి సర్కార్ దాదాపు అన్ని ఆంక్షలను తొలగించింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అరైవల్ సమయంలో హోం క్వారంటైన్ గానీ, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌ గానీ ఉండవు. అలాగే జర్నీకి ముందు పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి అవసరం లేదు.          

Updated Date - 2022-03-08T19:16:40+05:30 IST