ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ కింగ్ సల్మాన్‌

ABN , First Publish Date - 2020-12-26T14:48:05+05:30 IST

సౌదీ అరేబియా రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న సౌదీ కింగ్ సల్మాన్‌

రియాద్: సౌదీ అరేబియా రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. సౌదీ జాతీయ కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రణాళికకు అనుగుణంగా రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ టీకా తీసుకున్నారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తవ్ఫిక్ అల్ రబియా చెప్పారు. దేశ పౌరులు, నివాసితులకు ఉచితంగా టీకాలు అందించడం పట్ల కింగ్ సల్మాన్‌కు ఆరోగ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నెల 17వ తేదీ నుంచి దేశ ప్రజలకు ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి అటు సౌదీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,61,903 మంది వైరస్ బారినపడగా.. ఇందులో 6,168 మంది మృతిచెందారు. 




Updated Date - 2020-12-26T14:48:05+05:30 IST