Saudi Man Marriages: 43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు చేసుకున్న సౌదీ వ్యక్తి.. అతను అన్ని వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-17T01:53:01+05:30 IST

పెళ్లి చేసుకుంటే ప్రశాంతత పోతుందని, మనశ్శాంతి ఉండదని చాలా మంది అంటూ ఉంటారు.

Saudi Man Marriages: 43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు చేసుకున్న సౌదీ వ్యక్తి.. అతను అన్ని వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే..

పెళ్లి చేసుకుంటే ప్రశాంతత పోతుందని, మనశ్శాంతి ఉండదని చాలా మంది అంటూ ఉంటారు. అయితే సౌదీ అరేబియాకు (Saudi Arabia) చెందిన ఓ వ్యక్తి ప్రశాంతతను, మనశ్శాంతిని అన్వేషిస్తూ ఏకంగా 53 పెళ్లిళ్లు (Saudi man marries 53 times) చేసుకున్నాడు. చివరకు 63 ఏళ్ల వయసులో అసలు నిజం తెలుసుకున్నాడు. పెళ్లి వల్ల ప్రశాంతత, మనశ్శాంతి దొరకవని తెలుసుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన అబూ అబ్దుల్లా (63) ఈ శతాబ్దపు బహుభార్యావేత్త (polygamist of the century) అనే బిరుదును సంపాదించుకున్నాడు. అతను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వివాహాల గురించి మాట్లాడాడు. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన నెలకే భర్తను వదిలేసిన భార్య.. 4 ఏళ్ల తర్వాత మృతి.. ఆత్మహత్య అనుకున్న పోలీసులకే 6 రోజుల తర్వాత మైండ్‌బ్లాక్..!


`నేను 43 ఏళ్లలో 53 మంది మహిళలను వివాహం చేసుకున్నాను. 20 సంవత్సరాల వయసులో నేను మొదటి వివాహం చేసుకున్నాను. ఆమె నాకంటే ఆరేళ్లు పెద్దది. ఆ వివాహం తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను. పిల్లలను కూడా పొందాను. అయితే ఆ తర్వాత మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. 23 సంవత్సరాల వయస్సులో మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నా నిర్ణయాన్ని మొదటి భార్యకు తెలియజేసి రెండో పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత ఆ ఇద్దరూ తమలో తాము గొడవపడుతూ నన్ను ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడు, నాలుగు వివాహాలు చేసుకున్నాన`ని చెప్పాడు. 



`నన్ను సంతోషపెట్టగల స్త్రీ కోసం వెతుకుతున్న క్రమంలో నేను అనేక వివాహాలు చేసుకున్నాను. నా జీవితంలో అతి చిన్న వివాహం కేవలం ఒక రాత్రి మాత్రమే కొనసాగింది. నా భార్యలలో చాలా మంది సౌదీ మహిళలే. కొందరు విదేశీ మహిళలు కూడా ఉన్నారు. విదేశీ వ్యాపార పర్యటనల సమయంలో వారిని వివాహం చేసుకున్నా. నిజానికి ప్రపంచంలోని ప్రతి పురుషుడు ఒకే స్త్రీతో కలకాలం ఉండాలని కోరుకుంటాడ`ని అబ్దుల్లా చెప్పాడు. తాను ఇప్పుడు ఒక మహిళతోనే జీవిస్తున్నాని, మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇక తనకు లేదని అబ్దుల్లా చెప్పాడు. 

Updated Date - 2022-09-17T01:53:01+05:30 IST