అమ్మాయిని కాదు బాబోయ్.. మగాడిని.. 21 ఏళ్ల తర్వాతే తెలిసిందంటున్న కుర్రాడు.. ప్రపంచంలోనే వింత కేసు..!

Published: Fri, 20 May 2022 20:23:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమ్మాయిని కాదు బాబోయ్.. మగాడిని.. 21 ఏళ్ల తర్వాతే తెలిసిందంటున్న కుర్రాడు.. ప్రపంచంలోనే వింత కేసు..!

ఇంటర్నెట్ డెస్క్: వయసు పెరిగే కొద్దీ సాధారణంగా అమ్మాయి శరీరంలో మార్పులు వస్తాయి. అయితే ఈ మార్పులు 21ఏళ్ల యువతి విషయంలోజరగలేదు. దీంతో కంగారుపడ్డ ఆమె.. డాక్టరును సంప్రదించింది. అనంతరం వైద్యులు చెప్పింది విని షాకైంది. తాను మగాడిననే విషయం తెలిసి విస్తుపోయింది. ఇంతకూ అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


సౌదీలోని రాజధాని రియాద్‌కు చెందిన రాందా షాబెలీ (Randa Shabeli) ప్రస్తుతం 21 ఏళ్లు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగే పెరిగింది. అయితే వయసుతోపాటు శరీరంలో జరగాల్సిన మార్పులు రాందా విషయంలో జరగలేదు. దీంతో కంగారు పడింది. అంతేకాకుండా డాక్టర్లను సంప్రదించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డాక్టరు దగ్గరకు వెళ్లి పలు రకాల టెస్టులు చేయించుకుంది. అనంతరం డాక్టర్లు చెప్పింది విని షాకైంది. అసలు తాను అమ్మాయినే కాదనీ.. పురుష జననేంద్రియాలు పొత్తి కడుపులోనే ఉండిపోయాయని తెలుసుకుని అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన రాందా విస్తుపోయాడు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన పొరపాటు గురించి వివరించాడు. 


రియాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాను జన్మించానని.. ఆ సందర్భంగా పురుష జననేంద్రియాలు బయటకు కనపడకపోవడంతో అక్కడి డాక్టర్లు తనను అమ్మాయిగా భావించారని తెలిపాడు. దీంతో తాను కూడా చిన్నతనం నుంచి అమ్మాయిలాగే పెరిగినట్టు వివరించాడు. అయితే 21ఏళ్ల వయసు వచ్చినా శరీరంలో మార్పులు రాకపోవడంతో.. వైద్యుని సంప్రదించినట్టు పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఈ సంచలన విషయం బయటపడిందన్నాడు. అయితే పొత్తి కడుపులో ఉన్న పురుష జననేంద్రియాలను బయట తీయడం కోసం శస్త్రచికిత్సలు చేయాలని డాకర్లు చెప్పినట్టు వెల్లడించాడు. అందుకోసం బ్రిటన్ వెళ్లాలని సూచించారని తెలిపాడు. అంతేకాకుండా గుర్తింపు పత్రాల్లో తనను అబ్బాయిగా గుర్తించాని.. పేరును రాయెద్(Raed) మార్చాలని కోరుతూ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలోనే తనను అమ్మాయిగా ముద్ర వేసిన ఆసుపత్రిపై కేసు పెట్టినట్లు తెలిపాడు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.