సావర్కర్‌తో భోజనానికి నిరాకరించిన గాంధీజీ.. కారణం తెలిస్తే.. మరోమారు జోహార్ మహాత్మా అంటారు!

ABN , First Publish Date - 2021-10-14T18:06:04+05:30 IST

మహాత్మా గాంధీ చెప్పిన మీదటే.. వీర్ సావర్కర్..

సావర్కర్‌తో భోజనానికి నిరాకరించిన గాంధీజీ.. కారణం తెలిస్తే.. మరోమారు జోహార్ మహాత్మా అంటారు!

మహాత్మా గాంధీ చెప్పిన మీదటే.. వీర్ సావర్కర్.. బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్ ఇచ్చారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది రాజకీకంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపధ్యంలో గాంధీ, సావర్కర్ మధ్యగల సంబంధం గురించి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని విక్రమ్ సంపత్ తన 'సావర్కర్' పుస్తకంలో ప్రస్తావించారు.. ఒకసారి మహాత్మాగాంధీ సావర్కర్‌ను కలవడానికి ఇండియా హౌస్‌కు వెళ్లినప్పుడు, అతను చేపలు వండడాన్ని చూసి ఆశ్చర్యపోయారని రాసివుంది. ఈ సమావేశానికి సంబంధించిన సరైన ఆధారాలు లేనప్పటికీ, హరీంద్ర శ్రీవాస్తవ తాను చూసిన సంఘటనలు వివరించారు. మహాత్మాగాంధీ ఇండియా హౌస్‌కి చేరుకున్నప్పుడు.. ఆ సమయంలో సావర్కర్ చేపల కూర వండుతున్నారు. ఒక బ్రాహ్మణుడు చేపల కూర వండడాన్ని చూసి గాంధీ ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడ ఆహారం తినడానికి గాంధీ నిరాకరించారు. అయితే సావర్కర్ గాంధీ దగ్గరకు వచ్చి.. అందరితో కలిసి భోజనం చేయాలని కోరారు.


మహాత్మా గాంధీ పూర్తి శాఖాహారి. దీంతో గాంధీజీ అక్కడ ఆహారం తినబోనని చెప్పారు. అప్పుడు సావర్కర్.. గాంధీతో.. మీరు మాతోపాటు తినలేకపోతే..మాతో ఎలా కలసి పని చేస్తారు?' అని అడిగారు. ఈ విధంగా సావర్కర్ బ్రిటిష్ వారి పట్ల తనకున్న ద్వేషాన్ని వ్యక్తం చేశారు.. అది ఉడికించిన చేప మాత్రమేనని గాంధీకి తెలిపారు. మాకు బ్రిటిష్‌వారిని పచ్చిగా తినగలిగే వ్యక్తులే కావాలని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో సావర్కర్ జైలు జీవితానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. దీనిలో అతని క్షమాభిక్ష పిటిషన్ గురించిన ప్రస్తావనవుంది. ఈ పుస్తకంలోని వివరాల ప్రకారం.. సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఏజీ నూరానీ వంటి స్వాతంత్ర్య సమరయోధులు పిరికితనమని అభివర్ణించారు. సావర్కర్ బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మ అని కూడా ఆరోపించారు. అదే సమయంలో ధనంజయ్ కీర్ లాంటి స్వాంతంత్ర్య యోధులు సావర్కర్‌ది మంచి ఆలోచనా విధానమని పేర్కొన్నారు. సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్‌ను శివాజీ తన విడుదల కోసం ఔరంగజేబుకు రాసిన లేఖతో పోల్చారు. విక్రమ్ సంపత్ ఈ పుస్తకాన్ని సావర్కర్ పేరుతో ఆంగ్లంలో రాయగా, దీనిని హిందీలోకి సందీప్ జోషి అనువదించారు. 

Updated Date - 2021-10-14T18:06:04+05:30 IST