Advertisement

క్యాన్సర్ బారిన సోమిత.. సాయం కోసం వేడుకోలు

Sep 9 2020 @ 13:30PM

"నేను తండ్రి పాత్రలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ నాకు ఒక్కటే పట్టుదల ... నా పిల్లలకు మంచి జీవితం ఏర్పడేలా చక్కగా చదువు చెప్పించాలని. కానీ, నా కుమార్తెకు క్యాన్సర్ వ్యాధి రావడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా కూతురి చికిత్సకు అయ్యే ఖర్చును నేను భరించలేను. ఆమె భవిష్యత్తు ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు" అంటూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు రాము.


రాము, జ్యోతి దంపతుల కుమార్తె సోమిత ప్రస్తుతం Acute B-lymphoblastic leukaemia చికిత్స నిమిత్తం కీమోథెరపీ తీసుకుంటోంది. సోమిత పరిస్థితి చాలా దారుణంగా ఉందని... తనకు వెంటనే అలోజెనిక్ బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ జరగాలని డాక్టర్స్ చెప్పారు. కానీ, ఆమెది పేద కుటుంబం కావడంతో ఈ చికిత్సకు అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి ఉంది.


బైక్ మెకానిక్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్న రాముకు నెలకు వచ్చే ఆదాయం సుమారు రూ.9,000 కాగా, ఆ డబ్బుతో తన కుటుంబం నెలవారీ అవసరాలు తీర్చుకోవడం అతికష్టం. ఇదిగాక మరోవైపు కరోనా దెబ్బతో వచ్చిపడిన లాక్‌డౌన్ కారణంగా రాముకు పని దొరకని దుస్థితి.


ప్రస్తుతం తమ కుమార్తెను చేర్పించిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రిలోనే రాము, జ్యోతి ఉంటున్నారు. నగరంలో వారికి తెలిసినవారెవరూ లేకపోయినప్పటికీ, ఏ మాత్రం సందేహించక తమ కొడుకును బంధువుల ఇంట్లో వదిలిపెట్టి కుమార్తె చికిత్స కోసం ప్రయాణం కావలసి వచ్చింది.

 "సోమితకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే... పెయింటింగ్ ఆమెలో చిరునవ్వులు పూయిస్తుంది. సోమిత పెయింటింగ్ కోసం అవసరమైన వస్తువుల్ని నేను తెచ్చి ఇచ్చినప్పుడు తన బ్రష్‌ని కూడా పట్టుకోలేనంద బలహీనురాలైంది. భరించలేని నొప్పి వల్ల ఆ ఉత్సాహం... సంతోషం మటుమాయమయ్యాయి" అని భారమైన హృదయంతో చెప్పారు సోమిత తల్లి జ్యోతి.


సోమిత కుటుంబ సభ్యులకు వైద్యులు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆమెకు అలోజెనిక్ బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి తన అన్న దేహం సరిగ్గా సరిపోతుందని ధృవీకరించారు. కానీ, ఈ ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు సోమితకు మరికొన్ని కీమోథెరపీ సైకిల్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ, మరోవైపు ఈ చికిత్సకయ్యే ఖర్చు నిమిత్తం డబ్బు సేకరించడం ఆమె తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది.


"సోమిత చికిత్సకయ్యే డబ్బు కోసం రోజూ ప్రయత్నిస్తున్నాం. నా స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికే చాలా అప్పులు చేశాను. లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ నాకున్న ఏకైక ఆదాయమార్గం కాస్తా మూసుకుపోయింది. నేనిప్పుడు పూర్తిగా నిస్సహాయుడిని. సోమితను ఆసుపత్రిలో చేర్పించి 4 నెలలు దాటింది. తన చికిత్సకు కావలసిన డబ్బును సమకూర్చుకోలేకపోయాను" అంటూ రాము తీవ్ర వేదనకు లోనయ్యారు.


సోమిత ట్రీట్‌మెంట్‌కు మొత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంత డబ్బు సమకూర్చుకోవడం ఆమె తల్లిదండ్రుల వల్ల కానే కాదు. తమ ఆర్థిక ఇబ్బంది వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి తమ కూతురును తమకు దక్కుకుండా చేస్తుందేమోనని వారు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాము-జ్యోతి దంపతులకు మిగిలిన ఆశాకిరణం మీరే.... వారి కుమార్తె సోమితకు కొత్త జీవితాన్ని అందించేందుకు చేయూతనివ్వండి. ఉదారంగా విరాళం అందించి... సోమిత ఈ క్యాన్సర్ వ్యాధిని జయించేందుకు తోడ్పడండి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.