పాఠశాల స్థలాన్ని కాపాడండి!

Published: Tue, 28 Jun 2022 00:15:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠశాల స్థలాన్ని కాపాడండి!సెల్‌ టవర్‌ ఎక్కిన విద్యా కమిటీ చైర్మన్‌ పుల్లయ్య

సెల్‌టవర్‌ ఎక్కి విద్యా కమిటీ చైర్మన్‌ ఆత్మహత్యాయత్నం

అధికారుల హామీతో దిగివచ్చిన పుల్లయ్య

మార్కాపురం, జూన్‌ 27: పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని, ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థలాన్ని కాపాడటం కోసం ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమంటూ ఓ విద్యా కమిటీ చైర్మన్‌ హల్‌చల్‌ చేశారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. అర్ధవీడు మండలం శంకరాపురంలోని సర్వే నెంబర్‌ 546లో 3.80 ఎకరాల భూమిని ఎంపీపీ పాఠశాలకు కేటాయించారని, ఆ భూమిని గ్రామానికి చెందిన బుసా వెంకట నారాయణ ఆక్రమించి గోడకట్టుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ భీమానాయక్‌ అక్కడకు చేరుకొని నచ్చజెప్పి పుల్లయ్యను కిందకు దించారు. అనంతరం ఆయనతో ఆర్డీవో మాట్లాడారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.