ఎందుకంత ప్రేమంటే!

ABN , First Publish Date - 2022-04-20T08:01:56+05:30 IST

చీకటి కాగానే వీధుల్లో చెత్త పడేసి... తెల్లారగానే ‘స్వచ్ఛ’ క బుర్లు చెబితే ఎలా ఉంటుంది? అచ్చం భారతీయ స్టేట్‌ బ్యాం కు.. ఎస్‌బీఐ తరహాలోనే ఉంటుంది! ఏపీ సర్కారు చేస్తున్న దొంగ అప్పులకు సహకరిస్తూ... అడగడమే ఆలస్యమన్నట్లుగా అప్పులు ఇస్తున్న ఈ బ్యాంకు... ‘

ఎందుకంత ప్రేమంటే!

జగన్‌ సర్కారుపై ఎస్బీఐ ‘రహస్య ప్రేమ’

దేశవ్యాప్త అధ్యయనం పేరిట తప్పుడు లెక్కలు

ఏపీ అప్పుల కుప్ప అయ్యేలా ‘సహకారం’

ఇప్పుడు ప్రజాకర్షక పథకాలపై ఆందోళన.. 

ఉచిత పథకాలకు చేసే ఖర్చుపై గిమ్మిక్కులు..

తెలంగాణ విషయంలో స్పష్టమైన వివరణ

ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న ఖర్చుపై అస్పష్టత..

ఆదాయంలో 5-19 శాతం చేస్తున్నట్లు వెల్లడి

బడ్జెట్‌ లెక్కలు తీసుకున్నా అది 40 శాతం..

లోటులో కూరుకున్న జగన్‌ సర్కారుకు ‘మేకప్‌’


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

చీకటి కాగానే వీధుల్లో చెత్త పడేసి... తెల్లారగానే ‘స్వచ్ఛ’ క బుర్లు చెబితే ఎలా ఉంటుంది? అచ్చం భారతీయ స్టేట్‌ బ్యాం కు.. ఎస్‌బీఐ తరహాలోనే ఉంటుంది! ఏపీ సర్కారు చేస్తున్న దొంగ అప్పులకు సహకరిస్తూ... అడగడమే ఆలస్యమన్నట్లుగా అప్పులు ఇస్తున్న ఈ బ్యాంకు... ‘దేశంలో అనేక రాష్ట్రాలు అనుచిత స్థాయిలో ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నాయి. ఆదాయంలో అధిక వాటా ఖర్చు పెడుతున్నాయి’ అంటూ తెగ ఆందోళన వ్యక్తం చేసింది. అందులోనూ.. ఏపీకి సంబంధించిన లెక్కలను మాత్రం స్పష్టంగా చెప్పకుండా, రాష్ట్రంపై ‘రహస్య ప్రేమ’ చూపించడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో మునగడానికి ప్రధాన కారణం ఈ బ్యాంకే! సామాన్యుడు ఇల్లు కొనడానికి రుణం కోరితే... బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు సంధిస్తాయి. పత్రాలను భూతద్దం పెట్టి మరీ చూస్తాయి. ‘లీగల్‌ ఒపీనియన్‌’ సహా అన్ని రకాల శల్య పరీక్షలు చేసిన తర్వాత కూడా ఏ చిన్న కారణం కనిపించినా రుణం ‘రిజెక్టెడ్‌’ అని స్టాంప్‌ వేసేస్తాయి.


కానీ.. జగన్‌ సర్కారుపై మొదటి నుంచీ ఎస్బీఐకి ప్రేమ ఎక్కు వ. కేవలం అప్పులు తెచ్చేందుకే పెట్టిన ‘రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌’(ఎస్‌డీసీ)కు ఎస్బీఐ స్వయంగా బ్రోకరేజీ చేసింది. రూ. 25వేల కోట్ల అప్పులు ఇప్పించేందుకు రూ.45 కోట్ల ఫీజు తీసుకుంది. ఇతర బ్యాంకులతో కన్సార్షియం ఏర్పాటు చేసింది. రూ. 23,200 కోట్ల రుణం ఇప్పించింది. కానీ... ఎస్‌డీసీ ఏర్పాటే అక్రమమని, దాని ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పింది. దీంతో... చివరగా ఇవ్వాల్సిన రూ.1800 కోట్లు అప్పు ఆగిపోయింది.


నివేదికలోనూ పక్షపాతమే!

మొత్తం ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వం 35ు ప్రజాకర్షక పథకాల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. ఏపీ నిర్దిష్టంగా ఎంత ఖర్చు చేస్తోందో చెప్పలేదు. కానీ... ఏపీ సహా 7 రాష్ట్రాలు 5 నుంచి 19 శాతం ఖర్చు చేస్తున్నట్లు అస్పష్టమైన లెక్క చెప్పింది. ఐదుకూ... 19కీ మధ్య మరో 14 సంఖ్యలున్నాయి. అందులో... ఏపీ పెడుతున్న ఖర్చు ఎంత అన్నదే ప్రశ్న! ఎస్బీఐ చెప్పినట్లుగా ఆదాయం లెక్కలే తీసుకున్నా.. ఏపీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,17,000 కోట్ల ఆదాయం వచ్చిందని బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం చెప్పిం ది. ఇందులో రూ.40,000 కోట్లు నగదు బదిలీ, ఉచిత పథకాల కోసం ఖర్చు చేశామని అంగీకరించింది. అంటే... దాదాపు 40 శాతం ప్రజాకర్షక పథకాలకు ఖర్చు చేసినట్లు! ఎస్బీఐ లెక్కల ప్రకారమే చూస్తే... ఇది తెలంగాణ(35 శాతం)కంటే చాలా ఎక్కువ! మరి... ఏపీ సర్కారు తన ఆదాయంలో ప్రజాకర్షక పథకాలకు 5-19 శాతం ఖర్చు పెట్టినట్లుగా ఎస్బీఐ ఎందుకు చెప్పినట్లు? మరోవైపు.. అసలు ఏపీకి ఆదాయం ఉందా అన్నది మరో ప్రశ్న!


గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 35,000 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించని, కార్పొరేషన్లలో దాచిన లోటు రూ.25,000 కోట్లు ఉంది. వెరసి మొత్తం ఏపీ రెవెన్యూ లోటు దాదాపు రూ.60,000 కోట్లు. ఇంత లోటు కనిపిస్తుండగా... ఉచిత పథకాలకు ఆదాయం నుంచి ఖర్చు చేస్తున్నారనడం తప్పుదోవ పట్టించడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 




ఆపద్బాంధవుడిలా ఆదుకుని... 

రాష్ట్రం కేంద్ర సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లకు బకాయి పడింది. రుణ వాయుదాలు, వడ్డీలు కట్టక పోవడంతో వసూలు కోసం స్వయంగా ఆ సంస్థల ఉన్నతాధికారులు విజయవాడలో దిగారు. ‘ఇస్తారా... చస్తారా’ అం టూ పీకలమీద కూర్చున్నారు. కొంతైనా కట్టకుంటే బకాయిలను ‘ఎన్‌పీఏ’లుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎస్బీఐ రాష్ట్రాన్ని ఆదుకుంది. ఏపీ మారిటైమ్‌ బోర్డు పేరిట రూ.1500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇదీ... రాష్ట్రం పట్ల ఎస్బీఐకి ఉన్న ప్రేమ!

Updated Date - 2022-04-20T08:01:56+05:30 IST