ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ప్రారంభం మరింత సులభం!

ABN , First Publish Date - 2021-04-23T23:15:28+05:30 IST

భారతీయ స్టేట్‌బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవడం ఇక మరింత సులభం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్

ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ప్రారంభం మరింత సులభం!

ముంబై: భారతీయ స్టేట్‌బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవడం ఇక మరింత సులభం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’ ద్వారా ఇంటి నుంచే ఎంచక్కా సేవింగ్ ఖాతా తెరుచుకోవచ్చు. ఇందుకోసం ‘యోనో’ యాప్‌లో వీడియో కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత కొవిడ్ కల్లోలం నేపథ్యంలో వినియోగదారులు బ్యాంకుకు రాకుండా నేరుగా ఇంటి నుంచే ఖాతా తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. కాంటాక్ట్‌లెస్, పేపర్ ‌లెస్ విధానంలో ఖాతా తెరిచేందుకు ఈ ఫీచర్ ఎంతగానే ఉపయోగడపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది.  


మొబైల్ బ్యాంకింగ్‌లో ఇది మరో కోణమని, వినియోగదారులు తమ బ్యాంకింగ్ అవసరాలకు డిజిటల్‌వైపు ఆకర్షితులవడానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నట్టు కంపెనీ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వినియోగదారులు తొలుత యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘న్యూ టు ఎస్‌బీఐ’ ఆప్షన్‌ను ఎంచుకుని ‘ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్’పై క్లిక్ చేయాలి. ఆధార్ వివరాలు నమోదు చేసి అథెంటికేషన్ పూర్తయిన తర్వాత వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కేవైసీ పూర్తిచేసుకునేందుకు వీడియో కాల్‌ను అటెండ్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత ఎస్‌బీ ఖాతా ఓపెన్ అవుతుంది.

Updated Date - 2021-04-23T23:15:28+05:30 IST