SBSP chief : ఓపీ రాజ్‌భర్‌కు వై కేటగిరి భద్రత

ABN , First Publish Date - 2022-07-22T17:07:30+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికినందుకు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ) చీఫ్ ఓపీ రాజ్‌భర్‌కు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను ...

SBSP chief : ఓపీ రాజ్‌భర్‌కు వై కేటగిరి భద్రత

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు పలికినందుకు రివార్డు?

పాట్నా(బీహార్): రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికినందుకు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్పీ) చీఫ్ ఓపీ రాజ్‌భర్‌కు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓపీ రాజ్‌భర్‌ ఓటు వేసినందుకు ఈ చర్యను ప్రతిఫలంగా భావిస్తున్నారు. రాజ్‌భర్ ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై నిత్యం ఘాటైన విమర్శలతో వార్తల్లో నిలిచారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భర్‌కు వై కేటగిరీ భద్రతను కల్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘాజీపూర్ పోలీసులు గురువారం సాయంత్రం రాజ్‌భర్‌కు భద్రత కల్పించారు.


యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు ద్రౌపది ముర్ముకు ఓటు వేస్తానని ఓం ప్రకాష్ రాజ్‌భర్ ప్రకటించారు. ఇది కాకుండా శివపాల్ సింగ్ యాదవ్ కూడా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. విపక్షాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయగా, ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ప్రకటించారు.ఎస్‌బిఎస్‌పి 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 


రాజ్‌భర్‌ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయగా, అందులో 6 స్థానాల్లో విజయం సాధించింది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ జహూరాబాద్ సీటును కూడా గెలుచుకున్నారు. 2022లో యోగి ప్రభుత్వం తిరిగి వచ్చినప్పటి నుంచి ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విరుచుకుపడ్డారు.


Updated Date - 2022-07-22T17:07:30+05:30 IST