Gujarat riots కేసులో మోదీకి క్లీన్ చిట్‌కు సుప్రీం సమర్ధన...హైకోర్టు ఆదేశాలపై వేసిన పిటిషన్ తిరస్కరణ

ABN , First Publish Date - 2022-06-24T17:05:34+05:30 IST

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ని సుప్రీంకోర్టు శుక్రవారం ధృవీకరించింది....

Gujarat riots కేసులో మోదీకి క్లీన్ చిట్‌కు సుప్రీం సమర్ధన...హైకోర్టు ఆదేశాలపై వేసిన పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ని సుప్రీంకోర్టు శుక్రవారం ధృవీకరించింది. హైకోర్టు ఆదేశాలపై వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం తిరస్కరించింది. గుజరాత్ హింసాకాండలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ మరణించిన కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.2002వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో ఎహ్సాన్ జాఫ్రీ మరణించారు.2002లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీతో పాటు మరో 63 మందికి క్లీన్ చిట్ ఇస్తూ సిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా జకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరింది.


జాఫ్రీ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాలని, లేకపోతే సామాజిక ఉద్దేశాల వల్ల అంతులేని కసరత్తు జరుగుతుందని సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ఈ పిటిషన్‌లో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ రెండో పిటిషనరుగా ఉన్నారు.జకియా జాఫ్రీ తరపున హాజరైన కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తు నిర్వహించలేదని, కుట్రదారులను రక్షించేందుకు దాని విచారణ లోపాలతో నిండిపోయిందని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. సిట్ అధికారులతో పాటు పోలీసులకు రివార్డు లభించిందని కపిల్ సిబల్ అన్నారు.

Updated Date - 2022-06-24T17:05:34+05:30 IST