స్కూటీని తనిఖీ చేస్తే 9 మద్యం బాటిళ్లు.. 21 ఏళ్ల యువతి అరెస్ట్‌కు యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-25T20:04:40+05:30 IST

బీహార్‌కు చెందిన ఆ యువతి తన స్కూటీని కజిన్ బ్రదర్‌కు ఇచ్చింది.. ఆ వ్యక్తి ఆ స్కూటీలో 9 మద్యం సీసాలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు..

స్కూటీని తనిఖీ చేస్తే 9 మద్యం బాటిళ్లు.. 21 ఏళ్ల యువతి అరెస్ట్‌కు యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

బీహార్‌కు చెందిన ఆ యువతి తన స్కూటీని కజిన్ బ్రదర్‌కు ఇచ్చింది.. ఆ వ్యక్తి ఆ స్కూటీలో 9 మద్యం సీసాలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు.. బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. స్కూటీ నెంబర్ ఆధారంగా 21 ఏళ్ల యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఆ యువతి యాంటిసిపేటరీ బెయిల్ కోసం బీహార్ హైకోర్టును ఆశ్రయించింది.. బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు యువతికి బెయిల్ మంజూరు చేసింది. 


`మద్యం బాటిళ్లు ఉన్న స్కూటీ ఆమెదే అయినప్పటికీ ఆ సమయంలో ఆమె అక్కడ లేదు. ఒక కేసులో నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని హైకోర్టు ఎందుకు వినియోగించుకోలేదో అర్థం కావడం లేదు. కేసు పూర్వాపరాలను పరిశీలించి వ్యక్తుల స్వేచ్ఛను కాపాడాల్సిన హైకోర్టు తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించకపోతే, చాలా మంది జైళ్లలో మగ్గిపోతార`ని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


9 మద్యం బాటిళ్లు ఉన్నాయనే కారణంతో పాట్నాకు చెందిన ఆ యువతి స్కూటీని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ యువతి కజిన్ బ్రదర్ స్కూటీ నడుపుతున్నాడు. స్కూటీ ఆమె పేరు మీద ఉండడంతో బాధిత యువతిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువతి బెయిల్ కోసం బీహార్ హైకోర్టును ఆశ్రయించింది. బీహార్ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటీషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ యువతికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆ యువతికి బెయిల్ తిరస్కరించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-04-25T20:04:40+05:30 IST