షీనాబోరా హత్య కేసులో Indrani Mukerjeaకి సుప్రీం బెయిల్

ABN , First Publish Date - 2022-05-18T17:30:25+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న Indrani Mukerjeaకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది...

షీనాబోరా హత్య కేసులో Indrani Mukerjeaకి సుప్రీం బెయిల్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న Indrani Mukerjeaకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.2012వ సంవత్సరంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు కొత్త మలుపు తిరిగింది.ఇంద్రాణి ముఖర్జియా ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉందని, ఈ కేసు సందర్భోచిత సాక్ష్యాధారాల ఆధారంగా ఉందని సుప్రీం పేర్కొంది. పీటర్ ముఖర్జీపై విధించిన షరతులే ఆమెకు కూడా విధిస్తామని సుప్రీం తెలిపింది.విచారణ సందర్భంగా ఇంద్రాణి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గత ఏడాది డిసెంబర్ 16వతేదీన  ఇంద్రాణి ముఖర్జియా గత నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌కు రాసిన లేఖలో తన కూతురు షీనా బతికే ఉందని, ప్రస్తుతం కశ్మీర్‌లో ఉందని పేర్కొంది.


ఏప్రిల్ 2012వ సంవత్సరంలో 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-05-18T17:30:25+05:30 IST