రాజీనామా చేసిన మహిళా జడ్జీని విధుల్లోకి తీసుకోండి...సుప్రీం సంచలన ఆదేశం

ABN , First Publish Date - 2022-02-10T18:10:11+05:30 IST

మహిళా న్యాయమూర్తి స్వచ్ఛంద రాజీనామాపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది...

రాజీనామా చేసిన మహిళా జడ్జీని విధుల్లోకి తీసుకోండి...సుప్రీం సంచలన ఆదేశం

న్యూఢిల్లీ: మహిళా న్యాయమూర్తి స్వచ్ఛంద రాజీనామాపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. 2014వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించి రాజీనామా చేసిన మహిళా న్యాయమూర్తిని తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాజీనామా చేసిన మహిళా న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తిరిగి విధుల్లోకి చేర్చింది.‘‘2014లో పిటిషనర్ చేసిన రాజీనామాను స్వచ్ఛందంగా పరిగణించలేమని మేం ప్రకటిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.మహిళా న్యాయమూర్తిని తిరిగి ఆమె పదవిలో నియమించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. 


మహిళ జడ్జి రాజీనామాకు ముందు అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.ఆమె రాజీనామాను ఆమోదించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.2014లో తనను బలవంతంగా రాజీనామా చేయించినందున తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆ మహిళ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 


Updated Date - 2022-02-10T18:10:11+05:30 IST