అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం

ABN , First Publish Date - 2022-09-29T07:08:44+05:30 IST

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడడంలో కలెక్టర్‌, ఎస్పీలతోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల పాత్ర ప్రశంసనీయమని ఎంపీ వంగా గీత పేర్కొ న్నారు.

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం
సమావే శంలో పాల్గొన్న ఎంపీ, జడీ ్ప చైర్మన్‌, కలెక్టర్‌, ఎస్పీ

జిల్లా స్థాయి విజిలె న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ)  సమావేశంలో వక్తలు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 28:  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడడంలో కలెక్టర్‌, ఎస్పీలతోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల పాత్ర ప్రశంసనీయమని ఎంపీ వంగా గీత పేర్కొ న్నారు. బుధవారం కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌లో కలెక్టర్‌ అఽధ్య క్షతన జిల్లా స్థాయి విజిలె న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ గీత, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియా, ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డీఆర్‌వో కె శ్రీధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె రంగలక్ష్మీదేవిలతోపాటు కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులు, వాటి పురోగతి, బాఽధితులకు సహాయం పంపిణీ, ఉపాధి కల్పన, సాఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల పక్షాన నిలిచి వారికి భరోసా కల్పించడంలో జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యల్లో కమిటీ సభ్యులు కీలక భాగస్వామ్యం కావాలన్నారు. కీల క అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. సమావేశానికి జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డాక్టర్‌ మోకా పవన్‌కుమార్‌, బండి వీరలింగేశ్వరరావు, గంగవంశం త్రినాథ్‌దేవ్‌, పిల్లి జ్యోతితోపాటు ఎన్‌జీవో సంస్థల నుంచి ఎస్‌పీ రెడ్డి, ఎన్‌ సుధాంజలి పాల్గొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీ పి శ్రీని వాస్‌, కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహ రావు, వ్యవసాయశాఖ జేడీ ఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.
చివరి వారంలో రెండు ప్రత్యేక గ్రీవెన్స్‌లు
ప్రతి నెల చివరి శనివారం రెండు ప్రత్యేక స్పందన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ కృతికాశుక్లా తెలిపారు. బుధ వారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. ప్రతి నెల చివరి శనివారం ఉదయం ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌, ఉద్యోగ సంఘాల గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్‌ ప్రతి నెల చివరి సోమవారం ఉండేదని, ఈ కార్యక్ర మానికి చివరి సోమవారానికి మార్చినట్టు చెప్పారు. తమ అర్జీల స్వీకరణకు ప్రత్యేక అవకాశం కల్పించాలని ఉద్యోగ సఘాల నేత లు కోరడంతో అందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.


Updated Date - 2022-09-29T07:08:44+05:30 IST