టెన్త్ ఉత్తీర్ణతతో railwayలో కొలువులు

ABN , First Publish Date - 2022-05-14T19:54:55+05:30 IST

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ(Ministry of Railways)కు చెందిన బిలాస్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(South East Central Railway)(ఎస్‌ఈసీఆర్‌) రాయ్‌పూర్‌ డివిజన్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌(Apprentice‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

టెన్త్ ఉత్తీర్ణతతో railwayలో కొలువులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ(Ministry of Railways)కు చెందిన బిలాస్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(South East Central Railway)(ఎస్‌ఈసీఆర్‌) రాయ్‌పూర్‌ డివిజన్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌(Apprentice‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలున్న విభాగాలు: 

డీఎంఆర్‌ ఆఫీసర్‌, రాయ్‌పూర్‌ డివిజన్‌: 696

వేగన్‌ రిపేర్‌ షాప్‌, రాయ్‌పూర్‌: 337

ట్రేడులు: వెల్డర్‌, టర్నర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌, హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌ డీజిల్‌, మెకానికల్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు

అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 24

వెబ్‌సైట్‌: secr.indianrailways.gov.in/

Read more