క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.. షీటీమ్స్‌కు ఫిర్యాదు పంపండి

ABN , First Publish Date - 2021-03-09T08:57:00+05:30 IST

ఆకతాయిల వేధింపులకు కళ్లెం వేసేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తోంది.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.. షీటీమ్స్‌కు ఫిర్యాదు పంపండి

హైదరాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆకతాయిల వేధింపులకు కళ్లెం వేసేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తోంది. మహిళలు పోలీ్‌సస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేకుండా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.  ఇది ఎలా పని చేస్తుందంటే.. మహిళా భద్రతా విభాగం రూపొందించిన లింక్‌ను స్మార్ట్‌ ఫోన్లలో సేవ్‌ చేసుకోవాలి. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగానే ఒక పేజీ కనిపిస్తుంది. అందులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఫిర్యాదు వివరాలను నమోదు చేయాలి. అవి ఆధికారులకు వెళ్లడం.. వాళ్లు స్పందించడం నిమిషాల్లో జరిగిపోతాయి. 

Updated Date - 2021-03-09T08:57:00+05:30 IST